BigTV English

AP Kutami mlc candidate: బొత్సకు పోటీగా.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా దిలీప్‌కు ఛాన్స్, కాసేపట్లో ఖరారు

AP Kutami mlc candidate: బొత్సకు పోటీగా.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా దిలీప్‌కు ఛాన్స్, కాసేపట్లో ఖరారు

AP Kutami mlc candidate: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు? టీడీపీ బరిలోకి దిగుతుందా ? లేక.. జనసేనకు ఛాన్స్ ఇస్తుందా? అసలు విశాఖలో ఏం జరుగుతోంది? కూటమి నేతల ఎత్తులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.


విశాఖ ఎమ్మెల్సీ బైపోల్ కూటమి అభ్యర్థిపై తర్జనభర్జన కొనసాగుతోంది. విశాఖలో ఆదివారం టీడీపీ అధ్యక్షు డు పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సీటు నుంచి టీడీపీ నుంచి గండి బాబ్జి, సీతంరాజు సుధాకర్, పీలా గోవింద సత్యనారాయణ రేసులో ఉన్నారు. చివరి నిమిషంలో ఆయా నేత లు డ్రాపైనట్టు తెలుస్తోంది. కేవలం మూడేళ్లు టర్మ్ మాత్రమే వుండడంతో ఆయా నేతలు వెనక్కి తగ్గినట్టు వార్తలు వస్తున్నాయి.

తెరపైకి కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. జనసేన నేత బైరా దిలీప్ చక్రవర్తి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.  పోటీ చేయడానికి ఆయన ముందుకొచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని నేతలు సీఎం చంద్ర బాబుకు తెలియజేయనున్నారు. దీనిపై సాయంత్రంలోగా అధిష్టానం నుంచి నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉన్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.


ALSO READ: సీఎం చంద్రబాబుతో తెలంగాణ స్పీకర్ భేటీ, టీటీడీతోపాటు..

ఇంతకీ ఎవరు? బైరా దిలీప్ చక్రవర్తి. మాజీ సివిల్స్ అధికారి. కేవలం మూడేళ్లు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత రాజీనామా చేశారు. ఐఏఎస్ లేదా ఐపీఎస్ అయితే ప్రజలతో ఉండాలని భావించారట. టేబుల్‌కి పరిమితం కావడంతో డ్రాపయ్యారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. చక్రవర్తికి ఏడెనిమిది భాషల్లో ప్రావీణ్యత ఉంది.

తొలుత చిరంజీవి ప్రారంభించిన పీఆర్పీ‌లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత జనసేనలో కొనసాగుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ టిక్కెట్‌పై పోటీ చేయాలని భావించారు. కాకపోతే సీఎం రమేష్ పేరు తెరపైకి రావడంతో ఆయన సైలెంట్ అయ్యారు. తాజాగా ఆయనకు అదృష్టం వరించిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నమాట. చిరంజీవి, పవన్‌కల్యాణ్, గంటా శ్రీనివాసరావుతో ఆయనకు మంచి సంబంధాలు న్నాయి.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×