BigTV English

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో తెలంగాణ స్పీకర్ భేటీ, టీటీడీతోపాటు..

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో తెలంగాణ స్పీకర్ భేటీ, టీటీడీతోపాటు..

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఇరువురు మధ్య దాదాపు అరగంట సేపు సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర పరిస్థితులతోపాటు టీటీడీ గురించి చర్చ జరిగినట్టు తెలుస్తోంది.


ఏపీ సీఎం చంద్రబాబు రెండురోజులుగా హైదరాబాద్‌లో వున్నారు. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్.. సీఎం చంద్రబాబును హైదరాబాద్ నివాసంలో కలిశారు. ఈ సమావేశంలో తిరుమల లో శ్రీవారి దర్శనాలకు సంబంధించి రిక్వెస్ట్ చేసినట్టు తెలిపారు.

అలాగే టీటీడీలో వసతి, దర్శనానికి సంబంధించి తెలంగాణ శాసనసభ్యులకు అర్హత కల్పించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. శాసనసభ్యుల రిక్వెస్టును ఆమోదించాలని కోరారు.


ALSO READ: రైతులకు గుడ్ న్యూస్.. కాసేపట్లో ధ్యానం బకాయిలు విడుదల

తిరుమల దర్శన కోసం తెలంగాణ నుంచి భక్తులు లక్షల్లో వెళ్తుంటారు. అయితే భక్తుల కోసం తెలంగాణ ప్రజాప్రతినిధులు అందించే సిఫార్సు లేఖలను ఆమోదించాలన్నది కోరుతున్నారు. ఎప్పటినుంచో తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం రిక్వెస్టును ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరోవైపు తెలంగాణలో టీడీపీ బలోపేతంపై దృష్టి సారించారు సీఎం చంద్రబాబు. రేపోమాపో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడ్ని నియమించనున్నారు. ఇటీవల జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. తెలంగాణలోని నేతల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత అధ్యక్షుడ్ని ప్రకటించే ఛాన్స్ ఉంది.

Related News

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

Big Stories

×