BigTV English

Prakasam Politics: ప్రకాశంలో సైలెంట్ పాలిటిక్స్ ప్లే చేస్తున్న ఆ నేత.. నేరుగా పవన్ నుండి పిలుపు.. వాట్ నెక్స్ట్?

Prakasam Politics: ప్రకాశంలో సైలెంట్ పాలిటిక్స్ ప్లే చేస్తున్న ఆ నేత.. నేరుగా పవన్ నుండి పిలుపు.. వాట్ నెక్స్ట్?

Balineni Srinivasa Reddy: సైలెంట్ రాజకీయాలకు స్పెషల్ ఆ జిల్లా. ఎప్పుడు ఈ జిల్లా రాజకీయ ముఖచిత్రం ఎలా మారుతుందో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితిగా చెప్పుకోవచ్చు. అందుకు ప్రధాన కారణం ఇక్కడి నాయకుల రాజకీయ ఎత్తుగడలే. ఇటీవల ఈ జిల్లాకు చెందిన మాజీ మంత్రి.. సైలెంట్ పాలిటిక్స్ తో షేక్ చేశారు. ఊహించని షాకిచ్చిన ఈ నేత.. ఇప్పుడు మరో షాకిచ్చేందుకు రెడీ అయ్యారట. ఆ జిల్లా ఏది? ఆ లీడర్ ఎవరు?


ఏపీలోని ప్రకాశం జిల్లా పాలిటిక్స్ అంతా డిఫరెంట్. ఇక్కడి నేతల్లో కొందరి వ్యవహార శైలి చాలా సైలెంట్ గా ఉంటుంది. కానీ వారిచ్చే షాకులు మాత్రం చాలా వైలెంట్ గా ఉంటాయని చెప్పవచ్చు. ఇటీవల ఈ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి చేరడం కూడా సేమ్ టు సేమ్ ఇలాంటిదే.

వైసీపీ లో నేనే రాజు.. నేనే మంత్రిలా హవా కొనసాగించిన బాలినేని, ఎన్నికల ఫలితాల అనంతరం వెళుతున్నా.. వెళుతున్నా అంటూ జనసేన లోకి జంప్ అయ్యారు. వైసీపీలో జిల్లా కింగ్ మేకర్ లా ఉన్న బాలినేని, జనసేనలో చేరికను స్థానిక జనసేన నాయకులు ఆహ్వానిస్తే, ఇక్కడి టీడీపీ నేతలు మాత్రం విభేదించారు. దీనికి కారణం వైసీపీలో కొనసాగిన సమయంలో బాలినేని తమను ఇబ్బందులకు గురి చేశారన్నది వారి వాదన.


ఇలా బాలినేనికి ఎదురుగాలి వీచినా, అనుకున్నది సాధించి చివరికి చెప్పినట్లుగా డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అంతవరకు ఓకే గానీ, బాలినేని గారూ.. వాట్ నెక్స్ట్ అంటున్నారు ఆయన క్యాడర్. ఇలాంటి క్రమంలో తాజాగా పవన్ మరీ పిలిపించుకొని బాలినేని తో భేటీ అయ్యారు. ఈ భేటీ వెనుక కారణం ఏమైనా, మరో ఊహించని షాక్ ఇచ్చేందుకు బాలినేని రెడీ అయ్యారన్నది టాక్.

Also Read: YS Sharmila: సీఎం అయ్యాడు.. విడిపోదామన్నాడు.. దారుణంగా అవమానించాడు.. జగన్ గుట్టు రట్టు చేసిన షర్మిళ

అసలే స్థానిక టీడీపీ నేతలు వద్దువద్దంటున్నా.. జనసేనలోకి చేరిన బాలినేనికి నామినేటెడ్ పదవి వరించే అవకాశం ఉందని పొలిటికల్ టాక్. ఇటీవల కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులను భర్తీ చేయనుంది. అందులో కొన్ని జనసేన కు కేటాయిస్తారు. వాటిలో మాజీ మంత్రి బాలినేనికి తప్పక వరిస్తుందని, లేకుంటే పార్టీలో కీలకపదవి దక్కే అవకాశాలు ఉన్నాయని చర్చ సాగుతోంది. అందుకే పవన్ మరీ పిలిపించుకొని, అసలు విషయాన్ని బాలినేనికి చెప్పినట్లు స్థానిక సోషల్ మీడియా కోడై కూస్తోంది.

జనసేన లో చేరిన సమయం నుండి సైలెంట్ గా ఉన్న బాలినేని ఎప్పుడు, ఏ షాకిస్తారోనన్నది ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. నామినేటెడ్ పదవి వరిస్తే మాత్రం, ఇక జిల్లాలో బాలినేనికి ఎదురులేదన్నది ఆయన అభిమానుల అభిప్రాయం. మరి బాలినేని గారూ.. వాట్ నెక్స్ట్!

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×