Srisailam News: ఏపీ వ్యాప్తంగా సంచలనం రేపిన అటవీ సిబ్బందిపై దాడి ఘటన కొత్త మలుపు తిరుగుతోందా? కేసు నమోదు విషయంలో తేడా ఎందుకొచ్చింది? టీడీపీ ఎమ్మెల్యేలతోపాటు జనసేన నాయకుడు బుక్కయ్యాడా? ఎమ్మెల్యేను ఏ2గా ఎందుకు పేర్కొన్నారు? గెస్ట్ హౌస్‌లో బంధించి దాడికి పాల్పడిందెవరు? అటవీ సిబ్బంది చేసిన దారుణాలు బయటకు వస్తాయా? ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.
శ్రీశైలం అటవీ సిబ్బందిపై దాడి చేసిన ఏపీ వ్యాప్తంగా పెను దుమారం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అటవీ శాఖ ఉద్యోగి కరిముల్లాపై దాడి, సిబ్బందిని బంధించడం నేపథ్యంలో కేసు నమోదు అయ్యింది. అయతే ఈ కేసులో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని ఏ2గా పేర్కొన్నారు. ప్రధాన నిందితుడిగా శ్రీశైలం నియోజకవర్గం జనసేన ఇన్‌ఛార్జి రౌతు అశోక్ ఏ-1గా ప్రస్తావించారు.
సీసీటీవీ కెమెరాలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దాడికి పాల్పడిన వీడియోలు ఉన్నాయని, ఆయన్ని ఏ-2గా ఎందుకు పెట్టారు? పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో దాడికి పాల్పడిన ఎమ్మెల్యేను ఏ-1గా ఎందుకు చేర్చలేదనే అనుమానాలు ఊపందుకున్నాయి. ఫారెస్టు సిబ్బంది ఆరోపిస్తున్నట్లు కూటమి నేతలు వారిని గెస్ట్ హౌస్‌లో బంధించి దాడికి పాల్పడ్డారా? ఇవే అనుమానాలు మొదలయ్యాయి.
శ్రీశైలం పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో సిబ్బంది విధులకు ఆటంకం కలిగించటం, భయభ్రాంతులకు గురి చేయటం లాంటి సెక్షన్లు నమోదు దేనికి సంకేతమని అంటున్నారు. ప్రకాశం జిల్లా అటవీ అధికారులు మాత్రం ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ALSO READ: ఇంజనీరింగ్ ఫీజుల పెంపు.. తెలంగాణ ప్రభుత్వం కొత్త రూల్స్
సెక్షన్లు115(2),127(2),351(2),132r/w 3 (5) సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. అటవీ సిబ్బందికి జనసేన ఇంచార్జ్ అశోక్ రౌత్‌కు సంబంధం ఏంటి? అనే ప్రశ్నలు లేకపోలేదు. అశోక్ జనసేన నాయకుడు. ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా ఉంటారని చెబుతున్నారు.
మంగళవారం రాత్రి ఉద్యోగులపై జరిగిన దాడిలో ఆయన ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అశోక్‌ను పిలిచి పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కేసులు నమోదు కావడంతో ఇకపై అధికారుల ఆగడాలపై ఆ నేతలు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఉద్యోగులు చేస్తున్న ఆగడాలను స్థానిక ప్రజాప్రతినిధులు బయటపెడతారా? లేదా అన్నది చూడాలి.