BigTV English

World’s Longest Film: ప్రపంచంలో పే…..ద్ద సినిమా, నెల రోజులు చూసినా అయిపోదట?

World’s Longest Film: ప్రపంచంలో పే…..ద్ద సినిమా, నెల రోజులు చూసినా అయిపోదట?

World’s Longest Film: సాధారణంగా సినిమా డ్యూరేషన్ ఎంత ఉంటుంది? మనం రెగ్యులర్ గా చూసే సినిమాలు రెండున్నర గంటలు ఉంటాయి. మరీ ఎక్కవ అంటే మూడు గంటల వరకు ఉంటుంది. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ప్రపంచంలోనే అత్యంత పొడవైన సినిమా. ఈ సినిమా డ్యూరేషన్ అక్షరాలా 51,420 నిమిషాలు. అంటే 857 గంటలు. 35 రోజుల 17 గంటలు. ఈ సినిమాను ఆపకుండా చూసినా నెలరోజుల్లో కంప్లీట్ చేయడం సాధ్యం కాదు. ఇంతకీ ఈ సినిమాలో ఏం ఉంటుంది?  ఎందుకు అన్ని రోజులు ఎందుకు తీయాల్సి వచ్చింది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


ప్రపంచంలోనే అతి పొడవైన సినిమా ‘లాజిస్టిక్స్’

ప్రపంచంలోనే అతి పొడవైన సినిమా పేరు ‘లాజిస్టిక్స్’. దీనిని స్వీడన్ కు చెందిన దర్శకుడు ఎరికా మగ్నసన్, డేనియల్ అండర్సన్ కలిసి తెరకెక్కించారు. ఈ సినిమా 2012లో విడుదల అయ్యింది.  ఇది ఒక ప్రయోగాత్మక సినిమా. ఇందులో  హీరోలు, విలన్లు ఉండరు. ఎలాంటి యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండవు. ఈ సినిమా పెరో మీటర్ అనే డివైజ్ చుట్టూ తిరుగుతుంది. ఈ డివైజ్ ఫ్యాక్టరీలో తయారు అయినప్పటి నుంచి తన గమ్యస్థానానికి ఎలా చేరిందో చూపిస్తారు. ఈ డివైజ్  మొదట్లో ట్రక్కులో, ఆ తర్వాత ట్రైన్ లో.. అనంతరం షిప్ లో ప్రయాణిస్తూ చేరాల్సిన ప్రదేశానికి ఎలా వెళ్లింది అనేది ఇందులో పూసగుచ్చినట్లు చూపిస్తారు. ఈ సినిమా రవాణా ప్రక్రియను రియల్ టైమ్ లో చూపిస్తుంది. అయితే, ఈ సినిమా పూర్తిగా విడుదల కాలేదు. కేవలం ట్రైలర్ మాత్రమే అందుబాటులో ఉంది.


ప్రపంచంలో అతి పొడవైన సినిమాలు

⦿ Ambiancé (2020, స్వీడన్): ఈ సినిమా నిడివి 720 గంటలు (30 రోజులు). ఈ చిత్రాన్ని కూడా ‘లాజిస్టిక్స్’ చిత్ర దర్శకులు ఎరికా మాగ్నసన్, డేనియల్ ఆండర్సన్ తెరకెక్కించారు. ఇది స్థలం, సమయం గురించిన కళాత్మక ఆలోచనను ప్రతిబింబిస్తుంది.

⦿ Modern Times Forever (2011, డెన్మార్క్): ఈ సినిమా నిడివి 240 గంటలు (10 రోజులు). సూపర్‌ ఫ్లెక్స్ అనే డానిష్ ఆర్ట్ గ్రూప్ ద్వారా నిర్మితమైన ఈ ప్రయోగాత్మక చిత్రం, హెల్సింకిలోని ఒక భవనం విచ్ఛిన్నమయ్యే ప్రక్రియను వేల సంవత్సరాల పాటు అనుకరిస్తూ చూపిస్తుంది.

⦿ Cinématon (1978–ప్రస్తుతం, ఫ్రాన్స్): ఈ సినిమా 208 గంటలు.  ఫ్రెంచ్ దర్శకుడు గెరార్డ్ కోర్ట్ దర్శకత్వంలో తెరకెక్కింది. ప్రతి సెగ్మెంట్ 3 నిమిషాల 25 సెకన్లు ఉంటుంది. 2023 నాటికి దీని నిడివి 208 గంటలకు చేరింది.

⦿ Beijing 2003 (2003, చైనా): ఈ సినిమా నిడివి 150 గంటలు (6 రోజుల 6 గంటలు). చైనీస్ కళాకారుడు ఐ వీవీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. బీజింగ్ నగరం చుట్టూ 2000 కిలోమీటర్ల రహదారి ప్రయాణాన్ని రికార్డ్ చేస్తుంది.

ఇండియాలో అతిపొండవైన సినిమాలు

భారతదేశంలో పలు సినిమాలు అత్యంత పొడవైన సినిమాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. అయితే, ఈ సినిమాలన్నీ థియేటర్లలో విడుదల అయ్యాయి. “తవమై తవమిరుందు” (1986) దేశంలో అతి పొడవైన సినిమాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీని నిడివి 4 గంటల 35 నిమిషాలు. అయితే, థియేటర్ విడుదల కోసం దీనిని 3 గంటల 24 నిమిషాలకు కుదించారు. ఈ చిత్రం చెరన్ దర్శకత్వంలో వచ్చింది. భారతీయ సినిమాలలో “గంగా జమున సరస్వతి” (1988) సినిమా కూడా 3 గంటలకు పైగా నిడివితో ఉన్నాయి.

Read Also: నోరా ఫతేహిలా కనిపించాలంటూ భార్యను అలా చేసిన భర్త.. సీన్ కట్ చేస్తే..

Related News

Megastar Chiranjeevi: చిరంజీవిని చంపాలని చూశారా..? బర్త్ డే వేళ బయటపడ్డ నిజం..

HBD Chiranjeevi : తెలుగు నటరస నవరాజా శంకరుడే ఈ చిరంజీవుడు

Allu Arjun: మెగా మామకి స్పెషల్ విషెస్.. రూమర్స్ కి చెక్ పెట్టిన బన్నీ!

Janhvi Kapoor : వివాదంలో జాన్వీ కపూర్.. సోషల్ మీడియాలో సింగర్ పై విమర్శలు..!

Ram Gopal Varma: 10రెట్ల వేగంతో పుంజుకుంటాడు.. నాగవంశీ పై వర్మ ఆసక్తికర ట్వీట్!

Big Stories

×