Ram Gopal Varma: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) ఇప్పుడు బాలీవుడ్ లో ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే.. అక్కడే సెటిలైపోయిన ఈయన.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ దాదాపు అన్ని న్యూస్ కవర్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ మొదలు బాలీవుడ్ వరకు పలు అంశాలపై స్పందిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత నాగవంశీ (Naga Vamshi) పై గత కొద్ది రోజులుగా జరుగుతున్న ట్రోల్స్ కి రాంగోపాల్ వర్మ స్పందించడం ఇప్పుడు వైరల్ గా మారింది.
నాగవంశీపై ట్రోల్స్.. వర్మ ట్వీట్..
రాంగోపాల్ వర్మ సాధారణంగా వ్యక్తుల గురించి కంటే వ్యవస్థ పైన ఎక్కువగా కామెంట్లు చేస్తూ ఉంటారు. అలాంటిది నిర్మాత నాగ వంశీపై పాజిటివ్ గా కామెంట్లు చేస్తూ ట్వీట్ వేయడం సంచలనంగా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. వార్ 2 సినిమా విషయంలో నిర్మాత నాగవంశీ సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. దీనిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేస్తూ.. “నాగవంశీ ఒక దయగల నిర్మాత. ట్రోల్స్ ఆయనను ఎప్పటికీ కూడా కిందకు లాగలేవు. 10 రెట్ల వేగంతో ఆయన ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతారు” అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఇక ప్రస్తుతం నాగవంశీని ఉద్దేశించి వర్మ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా ఇటీవల కింగ్డమ్, వార్ 2 సినిమాల వల్ల నాగ వంశీ కి భారీ నష్టాలు వచ్చినట్లు వార్తలు ప్రచారం అవుతుండడంతోనే నెటిజన్లు ఆయనపై ట్రోల్స్ చేస్తున్నారు.
ALSO READ:Cine Workers Strike :సమ్మె ఉపసంహరణపై బిగ్ ట్విస్ట్..రెండు వర్గాలుగా చీలిన సినీ కార్మికులు!
https://twitter.com/RGVzoomin/status/1958572805714571430?t=inlEintZmFejl9hwJ5sHYw&s=08