E-Paper
Advertisement

Pithapuram Caste Discrimination: పిఠాపురంలో రోడ్డెక్కిన విద్యార్థులు.. ‘మీది వెదవ జాతి’ అంటున్నారని టీచర్లపై ఫిర్యాదు

Pithapuram Caste Discrimination: పిఠాపురంలో రోడ్డెక్కిన విద్యార్థులు.. ‘మీది వెదవ జాతి’ అంటున్నారని టీచర్లపై ఫిర్యాదు
Advertisement

Pithapuram Caste Discrimination: కాలం వేగంగా పరిగెడుతోంది. ఇప్పటికే సమాజంలో చాలా మార్పు వచ్చింది. సైన్స్, సాంకేతికరంగాల్లో దేశం దూసుకుపోతోంది. అంతా కంప్యూటర్ యుగమైంది. ప్రాంతాలు, కులాలకు సంబంధం లేకుండా అంతా ఉన్నత స్థానాలను అందుకుంటున్నారు. అంతరిక్షంలోకి రాకెట్లను పంపిస్తున్నాం.. ఇలా సమాజం ఎంతో మందుకు వెళ్తుంటూ.. ఇంకా కొన్ని చోట్ల కులం కట్టుబాట్లు.. వివక్షలు తగ్గడం లేదు.

తాజాగా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి మండలంలో చోటుచేసుకున్న ఒక షాకింగ్‌ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. యండపల్లి హైస్కూల్‌లో దళిత విద్యార్థులపై జాతి వివక్ష కొనసాగుతుందంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పాఠశాల ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. గత కొంతకాలంగా ఉపాధ్యాయులు తమ పిల్లలను అవహేళన చేస్తూ, కులం పేరుతో దూషిస్తున్నారని వారు ఆరోపించారు.

Advertisement

వివరాల ప్రకారం.. తరగతి గదుల్లోనే కొంతమంది ఉపాధ్యాయులు బహిరంగంగానే మీది వెధ‌వ జాతి, ఎస్సీలు ఏమైనా పుడింగులు అనుకున్నారా..? అని ఉపాధ్యాయులు తిడుతున్నారని విద్యార్థుల ఆవేద‌న‌ వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆడపిల్లలను చెడ్డపేర్లతో పిలుస్తూ అవమానిస్తున్నారని హెచ్‌ఎం‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.

Also Read: కర్చీఫ్ వేసిన సీట్లో కూర్చుంటావా? పురుషుడిని జుట్టుపట్టుకుని చితక్కొట్టిన మహిళలు

Advertisement

ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు, పాఠశాల ఎదుట పెద్ద సంఖ్యలో చేరి రోడ్డుపై బైఠాయించారు. ఉపాధ్యాయులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఈ ఘటన నేపథ్యంలో పాఠశాల నిర్వహణపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాలలో పిల్లలకు భద్రత, సమానత్వం ఉండాల్సిన సమయంలో ఉపాధ్యాయుల నుంచే అవమానాలు ఎదుర్కోవడం దారుణమని పలువురు అభిప్రాయపడ్డారు.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×