E-Paper
Advertisement

Flipkart Buy Buy Sale 2025: ఫ్లిప్‌ కార్ట్ బై బై సేల్.. బాబోయ్ ఇన్ని ఆఫర్లా? అస్సలు మిస్ కావొద్దు!

Flipkart Buy Buy Sale 2025: ఫ్లిప్‌ కార్ట్ బై బై సేల్.. బాబోయ్ ఇన్ని ఆఫర్లా? అస్సలు మిస్ కావొద్దు!
Advertisement

2025 మరికొద్ది రోజుల్లో పూర్తి కాబోతున్న నేపథ్యంలో.. ఆన్ లైన్ షాపింగ్ స్టోర్ ఫ్లిప్‌ కార్ట్ మరో క్రేజీ సేల్ ను ప్రారంభించబోతోంది. త్వరలో బై బై 2025 సేల్‌ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లు అందించే ఈ సేల్.. డిసెంబర్ 5న ప్రారంభంకానుంది. ఈ సేల్ తన బ్లాక్ ఫ్రైడే సేల్ తర్వాత అందుబాటులోకి రానుంది.  ఆయా ప్రొడక్టుల మీద పలు క్రేజీ ఆఫర్లను అందించబోతోంది. ఫ్లిప్‌ కార్ట్ దీనిని సంవత్సరంలో చివరి సేల్‌గా ప్రచారం మొదలుపెట్టేసింది.

స్మార్ట్ ఫోన్ల నుంచి హోమ్ నీడ్స్ వరకు..

ఫ్లిప్‌ కార్ట్ బై బై 2025 సేల్ లో భాగంగా స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌ టాప్‌ లు, గృహోపకరణాలు, దుస్తులు, యాక్సెసరీస్, చిన్న ఎలక్ట్రానిక్స్ సహా పలు వస్తువుల మీద మంచి డీల్స్ అందివ్వనుంది. అటు ఎంపిక చేసిన వినియోగదారులు 24 గంటల్లోపు సేల్ యాక్సెస్ పొందే అవకాశం కల్పిస్తుంది. అటు ఫ్లిప్‌ కార్ట్ ప్లస్ మెంబర్స్, బ్లాక్ టైర్ వినియోగదారుల కోసం ముందస్తు ఎంట్రీని ప్రారంభిస్తోంది. పరిమిత స్టాక్ స్మార్ట్‌ ఫోన్, ల్యాప్‌ టాప్, ఎలక్ట్రానిక్స్ డీల్స్ మీద వారికి ఫస్ట్ ఆప్షన్ ను అందిస్తుంది. ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్ తరచుగా పబ్లిక్ సేల్ ప్రారంభానికి ముందే క్లెయిమ్ చేయబడుతాయి.

బ్యాంక్ ఆఫర్లు, EMI డిస్కౌంట్లు

Advertisement

ఇయర్ ఎండ్ సేల్ లో భాగంగా భారీ తగ్గింపు ధరతో పాటు బ్యాంకింగ్ ప్రోత్సాహకాలను అందిస్తోంది. SBI క్రెడిట్ కార్డ్ వినియోగదారులు 10 శాతం ఇన్ స్టంట్ తగ్గింపును పొందే అవకాశం కల్పిస్తుంది. ఈ అవకాశం సాధారణ, EMI కొనుగోళ్ల పైనా లభిస్తుంది. ఫ్లిప్‌ కార్ట్ SBI క్రెడిట్ కార్డ్‌ ను ఉపయోగించే వినియోగదారులు చెక్‌ అవుట్‌ లో అదనంగా 10 శాతం ఇన్ స్టంట్ సేవింగ్ ను పొందే అవకాశం ఉంటుంది. అటు బజాజ్ EMI కార్డ్ వినియోగదారులు పలు కొనుగోళ్ల మీద రూ. 400 వరకు తగ్గింపును పొందవచ్చు.అటు యారో, లెవిస్ లాంటి బ్రాండ్లకు సంబంధించి సుమారు 10 శాత తగ్గింపు అందించబోతోంది.

డిసెంబర్ 5 నుంచి అందుబాటులోకి

అటు యాక్సెసరీస్, పవర్ బ్యాంకులు, ఆడియో ప్రొడక్టుల మీద ఫ్లిప్‌ కార్ట్ భారీగా తగ్గింపు అందిస్తోంది. గృహోపకరణాలు, కిచెప్ వేర్, క్లీనింగ్ వస్తువులు, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, అలంకరణ వస్తువులు  సహా ఇతర వస్తువుల మీద పెద్ద మొత్తంలో తగ్గింపు అందించబోతోంది. డిసెంబర్ 5న  వినియోగదారుల కోసం బై బై 2025 ప్రారంభించనున్నట్లు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఈ సేల్ మీద వినియోగదారులలో ఆసక్తి కలిగించేలా ఫ్లిప్‌ కార్ట్ కొత్త ప్రొడక్టులను యాడ్ చేస్తుంది. సో, ఇంకెందుకు ఆలస్యం, ఫ్లిప్‌ కార్ట్ బై బై సేల్ 2025లో మంచి ప్రొడక్టులను కొనేయండి. హ్యాపీగా ఇయర్ ను ఎండ్ చేయండి!

Advertisement

Read Also:  షావోమీ స్మార్ట్ ఫోన్లే కాదండోయ్, అదిరిపోయే ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!

Related News

జియో రూ.500 vs రూ.550 ప్లాన్స్.. ఉచిత ఓటీటీలు, అపరిమిత 5G.. యూజర్లకు పండగే!

ఖరీదైన గ్యాడ్జెట్లు అక్కర్లేదు.. 3D ప్రింటర్‌తో మీ హోమ్ థియేటర్‌ను ఇలా అప్‌గ్రేడ్ చేసుకోండి!

సుప్రీంకోర్టులో Vi కి భారీ ఊరట.. రూ.363 కోట్ల జీఎస్టీ వివాదంలో కేంద్రానికి షాక్!

ఐఫోన్ నీళ్లలో పడిందా? సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండా.. ఈ ఒక్క షార్ట్‌కట్‌తో నీటిని బయటకు పంపండి!

బడ్జెట్‌లో బిగ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ చూస్తే వెంటనే కొనుక్కోవాలనిపిస్తుంది!

Sony vs Bose.. ఈ రెండింటిలో ఏ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్ కొంటే మీ డబ్బులు వృధా కావు?

రూ.27,000కే ఇంత స్ట్రాంగ్ ఫోనా? 7200mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో అద్భుతమైన ఫీచర్లు!

మడతపెడితే క్రీజు కూడా కనిపించదు.. టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న హువావే కొత్త ఫోన్!

Big Stories

Advertisement
×