E-Paper
Advertisement

Viveka Murder Case: వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాల చెరిపివేత.. సీబీఐ ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు..

Viveka Murder Case: వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాల చెరిపివేత.. సీబీఐ ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు..
Advertisement
Viveka Murder Case

Viveka Murder Case latest news(Andhra news updates): వివేకా హత్యకేసుపై సీబీఐ ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి కుట్ర చేశారని సీబీఐ వెల్లడించింది. కుట్ర, హత్య సాక్ష్యాల చెరిపివేశారని ఛార్జిషీట్‌లో వివరించింది. ఫోటోలు, గూగల్‌ టేకౌట్‌, ఫోన్ల లొకేషన్‌ డేటాను సీబీఐ కోర్టుకు సమర్పించింది.

వివేక హత్య కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. వివేకా PA కృష్ణారెడ్డిపై అనుమానాలున్నా ఇప్పటివరకూ ఆధారాలు లభించలేదని అన్నారు. సాక్ష్యాలు చెరిపివేసేటప్పుడు మనోహర్‌రెడ్డి ఉన్నా.. అతని ప్రమేయంపై నిర్ధరణ కాలేదన్నారు.

Advertisement

వివేకా ఇంట్లో వైఫై రూటర్లకు కనెక్టైన వారి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. వైఫై రూటర్ల వివరాల కోసం అమెరికా అధికారులను కోరినట్లు వెల్లడించారు. వివేకా లేఖపై నిన్‌ హైడ్రిన్‌ పరీక్ష నివేదిక రావాల్సి ఉందన్నారు. పలు సెల్‌ఫోన్ల ఫోరెన్సిక్‌ నివేదికలు త్రివేండ్రం సీ డాక్‌ నుంచి రావాల్సి ఉందన్నారు. జూన్‌ 30న సీబీఐ సమర్పించిన ఛార్జిషీట్‌ను ఇటీవల కోర్టు విచారణకు స్వీకరించింది.

Related News

హారన్ కొట్టాడని రౌడీషీటర్ రచ్చ.. మేనేజర్‌పై దాడి

ఏపిలో కొత్త పింఛన్ల దారులకు గుడ్ న్యూస్.. దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు!

ఉప్పాడ తీరంపై పవన్ ఫోకస్.. గ్రౌండ్‌లోకి ఐఐటీ మద్రాస్ టీమ్

ఏపీ డీఎస్సీలో మరో భారీ స్కామ్ బట్టబయలు.. ఒకే ఇంట్లో అన్నాచెల్లెళ్లకు టీచర్ ఉద్యోగాలు!

రావులపాలెంలో దంపతుల సూ*సైడ్.. అసలు ట్విస్ట్ ఇదే!

వైఎస్సార్ కుటుంబంలో పెళ్లి సందడి.. షర్మిల కుమార్తెకు వివాహం నిశ్చయం.. వరుడు ఎవరంటే?

డీఎస్సీలో అక్రమాలే కాదు పేపర్ కూడా లీక్.. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ సంచలనం

బిగ్ టీవీకి సపోర్ట్‌గా రాజన్నదొర.. జగన్ ఆదేశిస్తే పోరాటమే!

Big Stories

Advertisement
×