BigTV English

CM Jagan: పవన్, లోకేశ్, బాలయ్య, చంద్రబాబు.. నలుగురికీ ఇచ్చిపడేసిన జగన్..

CM Jagan: పవన్, లోకేశ్, బాలయ్య, చంద్రబాబు.. నలుగురికీ ఇచ్చిపడేసిన జగన్..
AP CM Jagan meeting today live

AP CM Jagan meeting today live(Andhra Pradesh today news): వాలంటీర్లు సేవా రత్నాలని కొనియాడారు సీఎం జగన్. అలాంటి వారిపై కొందరు విమర్శలు చేస్తున్నారని విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి పవన్ పెళ్లిళ్ల ప్రస్తావన తీసిన జగన్.. ఇలాంటి వారు కూడా అమ్మాయిల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ సారి జగన్ విమర్శలకు మరింత పదును పెంచారు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణను కూడా తీవ్రస్థాయిలో విమర్శించారు.


నాలుగేళ్లకో పెళ్లి చేసుకునే పవన్‌.. వాలంటీర్ల క్యారెక్టర్‌ గురించి మాట్లాడతున్నాడని మండిపడ్డారు. నటన, మాటలు దత్తపుత్రుడివి అయితే.. నిర్మాత చంద్రబాబు అని విమర్శించారు. పదేళ్లుగా చంద్రబాబుకు వాలంటీర్‌ పనిచేస్తున్న ప్యాకేజీ స్టార్‌.. పవన్ కల్యాణ్ అంటూ ఫైర్ అయ్యారు. పవన్‌ది బీజేపీతో పొత్తు, చంద్రబాబుతో కాపురమన్నారు.

ఈసారి పవన్ తో పాటు లోకేశ్, బాలకృష్ణ, చంద్రబాబులపైనా హాట్ కామెంట్స్ చేశారు సీఎం జగన్. మందు తాగుతూ, అమ్మాయిలతో స్విమ్మింగ్‌ పూల్‌లో డ్యాన్స్‌లు చేసేవాడంటూ లోకేశ్‌ టార్గెట్‌గా విమర్శలు చేశారు. అమ్మాయిలు కనిపిస్తే ముద్దు పెట్టాలి, కడుపు చేసేయాలని చెప్పేవాడు మరొకడు అంటూ బాలకృష్ణపై డైలాగ్ పేల్చారు. చేసిన తప్పుడు పనులను గొప్పగా చెప్పుకునే ముసిలాయన ఇంకొకడు అంటూ చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. క్యారెక్టర్‌ లేని వాళ్లంతా.. వాలంటీర్ల గురించి మాట్లాడతారా? అంటూ మండపడ్డారు జగన్.


వాలంటీర్లు అంతా సేవాభావంతో పనిచేస్తున్నారని.. వారంతా మన ఇంటి పక్క ఉండే పిల్లలేనని అన్నారు. మహిళా వాలంటీర్లంతా తనకు చెల్లెమ్మలు లాంటివారని చెప్పారు. అలాంటి వాలంటీర్లు.. మహిళలను ట్రాప్ చేస్తున్నారని, అక్రమ రవాణా చేస్తున్నారని ఎలా అంటారంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి. ఎండా, వాన లెక్క చేయకుండా ప్రజలకు సేవలు చేస్తున్నారని.. ప్రతీనెల ఒకటో తేదీన సుర్యోదయం కాకముందే ఇంటికి పెన్షన్లు తీసుకొచ్చి ఇస్తున్నారని.. రాష్ట్రంలోనే ప్రతి గడపకు సంక్షేమాన్ని అందిస్తున్నారని అన్నారు. వాలంటీర్లను సేవామిత్ర, సేవా రత్నం, సేవా వజ్రాలంటూ కొనియాడారు. సంస్కారం ఉన్న ఏ ఒక్కరూ వాలంటీర్లను అవమానించరన్నారు సీఎం జగన్.

‘వైఎ‍స్సార్‌ నేతన్న నేస్తం’ ఐదో విడత నిధులు విడుదల సందర్భంగా.. వెంకటగిరి బహిరంగ సభలో సీఎం జగన్‌ ఇలా ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 80వేల 686 మంది అర్హులకు.. 193.64 కోట్లు రిలీజ్ చేశారు. వరుసగా ఐదో ఏడాది నిధులు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అయ్యాయి.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×