Big Stories

Avinash Reddy: 7 గంటల ఎంక్వైరీ.. ఏం జరిగింది? ఎలా జరిగింది?

Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డిని విచారించింది సీబీఐ. వివేకా హత్య కేసులో అవినాశ్‌ను శనివారం 7 గంటల పాటు ప్రశ్నించారు సీబీఐ అధికారులు. వివేకా హత్య రోజు వాట్సాప్ కాల్స్‌పై సుదీర్ఘంగా విచారించింది సీబీఐ. అవినాష్‌రెడ్డి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసినట్లు తెలిపారు సీబీఐ అధికారులు.

- Advertisement -

ఉదయం పది గంటల సమయంలో ఆయన సీబీఐ ఆఫీసుకు చేరుకున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకూ అవినాష్‌ను ప్రశ్నించింది సీబీఐ. సీబీఐ ఆఫీసుకు వచ్చిన వెంటనే ఆయన వద్ద ఉన్న ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం తిరిగి తన ఫోన్‌ను అవినాష్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది. అవినాష్ రెడ్డిని ప్రధానంగా వివేకా హత్య జరిగిన రోజున చేసిన వాట్సాప్ కాల్స్ వివరాల గురించి ఆరా తీశారు.

- Advertisement -

అడిషనల్ ఎస్పీ స్థాయిలో అధికారి సమక్షంలో అవినాష్‌రెడ్డి విచారణ కొనసాగుతోంది. విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియోలు సీబీఐ అధికారులు చిత్రీకరించారు. వివేకా హత్యకు వాడిని గొడ్డలిపై సీబీఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సునీల్ యాదవ్ గొడ్డలి దాచిన విషయం.. వివేకా మరణంపై జగన్ మోహన్ రెడ్డికి ముందుగా ఎవరు చెప్పారన్న విషయాన్ని సీబీఐ లేవనెత్తినట్లు తెలుస్తోంది. ఈ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని సీబీఐ అధికారులకు చెప్పారు అవినాష్‌.

ఇప్పటికే అవినాశ్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. ప్రతి శనివారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 వరకూ ఆయనను విచారించాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం సీబీఐ ముందు హాజరయ్యారు అవినాశ్. అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ను హైకోర్టు మంజూరు చేయడంతో.. అవినాష్ రెడ్డికి అరెస్ట్‌ టెన్షన్ లేకపోయింది. అందుకే ఈ సారి సీబీఐ ఆఫీసు వద్ద ఆయన అనుచురుల హడావుడి కనిపించలేదు.

అయితే వివేకా హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డిని ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు విచారించారు. అయితే గత నెలలో విచారణకు రావాల్సిందిగా సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేయగా.. పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టి.. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అవినాశ్‌ తల్లి అనారోగ్యం దృష్ట్యా ఇటీవల తెలంగాణ హైకోర్టు మే 31 వరకూ అవినాశ్‌ను అరెస్ట్ చేయొద్దని సీబీఐని గతంలో ఆదేశించింది. తాజాగా ముందస్తు బెయిల్ రూపంలో అవినాష్‌కు భారీ ఊరట లభించింది.

ప్రస్తుతం సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ఉన్నాయి. వెకేషన్ బెంచ్‌లు విచారణ జరుపుతున్నాయి. అత్యవసర కేసులు అయితేనే విచారిస్తారు. అందుకే ముందస్తు బెయిల్‌ను సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టుకు వేసవి సెలవుల తర్వాతనే సునీత కానీ.. సీబీఐ కానీ.. పిటిషన్లువేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందస్తు బెయిల్‌పై జూలై 2 తరువాతే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News