BigTV English

AvinashReddy: తండ్రిలానే అరెస్ట్ తప్పదా?.. అవినాశ్‌రెడ్డికి సీబీఐ నుంచి పిలుపు.. మండే మలుపు?

AvinashReddy: తండ్రిలానే అరెస్ట్ తప్పదా?.. అవినాశ్‌రెడ్డికి సీబీఐ నుంచి పిలుపు.. మండే మలుపు?
avinash Reddy arrest

AvinashReddy: వివేకా హత్య కేసులో అవినాశ్‌రెడ్డిని అరెస్ట్ చేస్తారా? గతంలో చాలాసార్లు ఈ ప్రచారం జరిగింది. ఈసారి మాత్రం పక్కాగా అరెస్ట్ అంటున్నారు. ఆదివారం అవినాశ్ తండ్రి భాస్కర్‌రెడ్డిని పులివెందులలో అరెస్ట్ చేసింది సీబీఐ. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. సోమవారం అవినాశ్‌రెడ్డిని విచారణకు పిలిచింది సీబీఐ. మరి, తండ్రిలానే కొడుకును సైతం అరెస్ట్ చేస్తారా? జైలుకు తరలిస్తారా? ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్.


ఈ ప్రచారానికి కారణం లేకపోలేదు. భాస్కర్‌రెడ్డిపై ఎలాంటి ఆరోపణలు ఉన్నాయో.. అవన్నీ అవినాశ్‌రెడ్డిపై కూడా ఉన్నాయి. తమ రాజకీయ ఎదుగుదలకు వివేకానందరెడ్డి అడ్డు వస్తున్నారని.. హత్య సమయంలో నిందితులంతా అవినాశ్‌రెడ్డి ఇంట్లో ఉన్నారని.. హత్య తర్వాత ఘటనా స్థలంలో సాక్షాలు తుడిపేసే ప్రయత్నం చేశారని.. ఇలా భాస్కర్‌రెడ్డిని ఏ కారణాలతోనైతే అరెస్ట్ చేశారో.. అవే అభియోగాలు అవినాశ్‌రెడ్డిపైనా చేస్తోంది సీబీఐ. పలు రిమాండ్ రిపోర్టుల్లో ఆ వివరాలు స్పష్టంగా నమోదు చేసింది. గూగుల్ టేకవుట్‌లో వారంతా ఒకేచోట ఉన్నట్టు తేల్చింది. ఇప్పటికే అవినాశ్‌రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసి కీలక సమాచారం రాబట్టింది. ఈసారి అవినాశ్‌రెడ్డి అరెస్ట్ తప్పదంటూ మరోసారి ప్రచారం జరుగుతోంది. ఇటీవల తనను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టుకు ఆశ్రయించినా అక్కడ ఊరట లభించలేదు.

భాస్కర్‌రెడ్డిని పులివెందులలో అరెస్ట్ చేశారు. ఆ సమయంలో సీబీఐ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు అతని అనుచరులు. అందుకే, అవినాశ్‌రెడ్డి విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారా? పులివెందులలో అయితే ప్రాబ్లమ్ అయ్యే అవకాశం ఉందని.. హైదరాబాద్‌కు విచారణ పేరుతో రప్పిస్తున్నారా? ఎంక్వైరీ తర్వాత అరెస్ట్ చూపిస్తారా? ఇలా సాగుతోంది చర్చ. అదే జరిగితే.. ఎంపీ అవినాశ్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తే..? ఆ తర్వాత పరిస్థితులు ఎలా మారుతాయనే టెన్షన్ అయితే కనిపిస్తోంది. సోమవారం అనంతపురం జిల్లాలో పర్యటించాల్సిన సీఎం జగన్ తన టూర్‌ను వాయిదా వేసుకోవడం ఇందుకేనా?


మరోవైపు, అవినాశ్‌రెడ్డికి అన్నిదారులు మూసుకుపోయి ఉన్న ప్రస్తుత సమయంలో ఎదురుదాడినే నమ్ముకున్నారా? సీబీఐ ఫుల్‌గా కార్నర్ చేస్తుండటంతో.. అవినాశ్‌రెడ్డి పదే పదే దర్యాప్తు సంస్థ తీరును తప్పుబడుతున్నారు. సీబీఐ విచారణ తీరు సరిగ్గా లేదంటూ.. ఎంక్వైరీ చేయాల్సింది అలా కాదు.. ఇలా అంటూ.. తన వెర్షన్ వినిపిస్తున్నారు. వివేక మర్డర్ స్పాట్‌లో లభించిన లేఖ, వివేకా అల్లుడు, వివేక రెండో భార్య, ఆస్థి పంపకాలు.. ఇలా విచారణను మరో సైడ్ మళ్లించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మరి, అవినాశ్‌రెడ్డి చెప్పినట్టు సీబీఐ విచారిస్తుందా? లేదంటే, తమ స్టైల్‌లో ఎంక్వైరీ కంటిన్యూ చేస్తుందా? ఓవైపు సుప్రీంకోర్టు డెడ్‌లైన్ దగ్గరపడుతుంటే.. కేసును త్వరగా క్లోజ్ చేయాల్సిన ఎమర్జెన్సీ సీబీఐకి ఉంది. సో.. ఆ క్లైమాక్స్ అవినాశ్‌రెడ్డి అరెస్ట్‌కు దారి తీస్తుందా? జస్ట్, ఎప్పటిలానే ప్రశ్నించి వదిలేస్తారా? ఏమో.. సోమవారం కీలక పరిణామం జరిగినా జరగొచ్చు అంటున్నారు.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×