Vijayasai Reddy Tour: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎందుకు నెల రోజులు ఫారెన్ టూర్‌కి శ్రీకారం చుట్టారు? గతంలో జరిగిన లావాదేవీల కోసం వెళ్తున్నారా? వ్యవసాయం చేసేందుకు కొత్త టెక్నాలజీ కోసం వెళ్తున్నారా? ఎందుకు సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది? సుప్రీంకోర్టు నిర్ణయమే అందుకు కారణమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విదేశీ టూర్‌కు న్యాయస్థానం అనుమతి ఇస్తుందా? కేవలం తక్కువ రోజులకే సరిపెడుతుందా? అదే జరిగితే జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వేగంగా జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సోమవారం సుప్రీంకోర్టు రోజువారీ విచారణ చేపట్టాలని ఎందుకు ప్రస్తావించింది. న్యాయస్థానం మాటలతో వైసీపీ నేతలకు టెన్షన్ మొదలైనట్టు కనిపిస్తోంది.
ఫిబ్రవరి 10 నుంచి- మార్చి10 వరకు ఫ్రాన్స్, నార్వే దేశాల్లో పర్యటించనున్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ క్రమంలో తన టూర్ కు పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీనిపై సోమవారం నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. సాయిరెడ్డి పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వవద్దని కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
ఎందుకంటే జగన్ అక్రమాస్తుల కేసు రోజువారీ విచారణ నేపథ్యమే ఇందుకు కారణమని ప్రస్తావించింది. ఒకవిధంగా చెప్పాలంటే వీఎస్ఆర్ టూర్‌కు సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. గతంలో ట్రయిల్ కోర్టు విదేవీ పర్యటనకు అనుమతి ఇచ్చిందని ఆయన తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు పూర్తిగా విన్న న్యాయస్థానం, తన తీర్పును ఈనెల 29 వరకు రిజర్వ్ చేసింది.
ALSO READ: షాకిచ్చిన విజయసాయి రెడ్డి.. చెప్పినట్లే చేశారుగా!
ఇంతకీ విజయసాయిరెడ్డికి ఫారెన్ టూర్‌కి అనుమతి వస్తుందా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. సోమవారం జగన్ బెయిల్ రద్దు, ఆస్తుల కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్లపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ట్రయల్ కోర్టు రోజువారీ విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఈ వ్యవహారాన్ని హైకోర్టు సైతం పర్యవేక్షించాలన్నది మరో పాయింట్. ఈ లెక్కన జగన్ ఆస్తుల కేసు దర్యాప్తు వేగవంతం కానుంది.
మరోవైపు న్యాయస్థానం ఆదేశాలపై వైసీపీ నేతలు ఉలిక్కిపడ్డారు. గడిచిన ఐదేళ్లు అధికారంలో ఉండడం, బిజీ షెడ్యూల్ వల్ల విచారణ డిలే అయ్యింది. ఇప్పుడు కచ్చితంగా విచారణ కోసం న్యాయస్థానానికి హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేగంగా విచారణ జరిగి కేసు కొలిక్కి రానుంది.
అదే జరిగితే తమ అధినేత జగన్ మళ్లీ జైలుకి వెళ్లే అవకాశముందని నేతలు చర్చించుకుంటున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే రాజు లేని రాజ్యం ఎలా ఉంటుందో.. జగన్ లేని పార్టీని ఊహించు కోలేకపోతున్నారు నేతలు. మొత్తానికి రానున్న నాలుగున్నరేళ్లు మాజీ సీఎం జగన్‌కు అనుక్షణం టెన్షన్ వెంటాడడం ఖాయమన్నమాట.