BigTV English

AP Railways: ఏపీలో కొత్తగా 11 రైల్వే లైన్లు.. 26 ప్రాజెక్టులు, ఆ శాఖ గ్రీన్ సిగ్నల్

AP Railways: ఏపీలో కొత్తగా 11 రైల్వే లైన్లు.. 26 ప్రాజెక్టులు, ఆ శాఖ గ్రీన్ సిగ్నల్

AP Railways: అభివృద్ధిపై చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్ చేసింది. కేవలం రహదారులు, ఎయిర్‌పోర్టులు మాత్రమే కాకుండా ప్రతీ నియోజకవర్గానికి రైల్వే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులోభాగంగా కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మచిలీపట్నం-నరసాపురం, ఒంగోలు-దొనకొండ సహా 11 ప్రాంతాల్లో కొత్త లైన్లు రాబోతున్నాయి. ఏపీ వ్యాప్తంగా 1,960 కిలోమీటర్లు మేరా 26 ప్రాజెక్టులు వాటి నిర్మాణానికి డీపీఆర్‌లు రెడీ చేస్తోంది.


ఏపీలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. మచిలీపట్నం-నరసాపురం, మచిలీపట్నం-రేపల్లె, ఒంగోలు-దొనకొండ, దూపాడు-బేతంచర్ల మధ్య కొత్త రైల్వే లైన్‌లకు డీపీఆర్‌లు రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా పలు మార్గాల్లో రైళ్ల రద్దీ అమాంతంగా పెరిగింది. ఆయా రూట్లలో అవసరమైన చోట్ల కొత్త లైన్లను నిర్మిస్తున్నారు.

మొత్తంగా 1,960 కిలోమీటర్లకు మేరా 26 ప్రాజెక్టులకు డీపీఆర్‌లు రూపొందిస్తోంది. అందులోనే హైదరాబాద్- బెంగళూరు వయా ఏపీ హైస్పీడ్ కారిడాల్‌లో 300 కిలోమీటర్లు, హైదరాబాద్-చెన్నె కారిడార్‌కు 464 కిలోమీటర్లకు సంబంధించిన డీపీఆర్‌పై కసరత్తు మొదలైంది. 11 మార్గాల్లో కొత్త లైన్ల నిర్మాణంపై రైల్వేశాఖ ఫోకస్ చేసింది. వీటికి గతంలో సర్వేలు జరిగాయి.


రైల్వే బోర్డు ఆమోదం తెలపడంతో డీపీఆర్‌లు రూపొందిస్తున్నారు. పలుచోట్ల బైపాస్‌ లైన్లు, రైల్‌ ఒవర్‌ రైల్‌ వంతెనల నిర్మాణాలపై దృష్టి పెట్టింది రైల్వేశాఖ. ఇదికాకుండా విశాఖ-విజయవాడ-హైదరాబాద్-చెన్నై మార్గాల్లో సరకు రవాణా రైళ్ల రాకపోకలు క్రమంగా పెరుగుతున్నాయి. ఆయా మార్గాల్లో మూడు, నాలుగో లైన్లపై దృష్టిపెట్టింది.

ALSO READ: ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. జగన్ హాజరుపై ఉత్కంఠ

కొన్ని మార్గాల్లో మూడో లైను రెడీ చేస్తోంది రైల్వేశాఖ. ఇక ఒడిశా నుంచి కొత్తవలస మీదుగా విశాఖపట్నానికి వివిధ ఖనిజాలు రవాణాచేసే రైళ్లు భారీగా ఉన్నాయి. సింహాచలం నుంచి కొత్తవలస వరకు ఐదు, ఆరో లైన్ల డీపీఆర్‌లు రెడీ అవుతున్నాయి. 26 ప్రాజెక్టుల డీపీఆర్‌లు డిసెంబరు నాటికి పూర్తి చేయాలని భావిస్తోంది.

కొత్త రైల్వే లైన్ల వివరాలపై ఓ లుక్కేద్దాం.
1. ఒంగోలు-దొనకొండ
2. దూపాడు-బేతంచర్ల
3. మచిలీపట్నం-నరసాపురం
4. మచిలీపట్నం-రేపల్లె
5. బాపట్ల-రేపల్లె
6. పాలసముద్రం-నారాయణపురం
7. కాచిగూడ-చిట్యాల-జగ్గయ్యపేట
8. కొండపల్లి-సత్తుపల్లి
9. కొత్తగూడెం-కిరండోల్
10.హైదరాబాద్-బెంగళూరు వయా ఏపీ మీదుగా హైస్పీడ్ కారిడార్
11. హైదరాబాద్-చెన్నై వయా ఏపీ మీదుగా హైస్పీడ్ కారిడార్
12. కొత్తవలస-అనకాపల్లి మధ్య బైపాస్ లైన్
13. గుంతకల్లు దగ్గర బైపాస్
14. పేరేచర్ల-మంగళగరి మధ్య బైపాస్ లైన్
15. గోపాలపట్నం -దువ్వాడ మధ్య మూడు, నాలుగో లైను
16. సూళూరుపేట-గూడూరు మధ్య మూడు, నాలుగో లైను
17. గుంతకళ్లు-బళ్లారి మధ్య నాలుగో లైను
18. కాజీపేట్-విజయవాడ మధ్య నాలుగో లైను
19. విజయవాడ-గూడూరు మధ్య నాలుగో లైను ఉన్నాయి. ఇవికాకుండా మరికొన్ని ఉన్నాయి.

Related News

AP Assembly live: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు.. సభ్యుల ప్రశ్నలు, లైవ్ చూద్దాం

Amaravati News: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు‌పై ఉత్కంఠ, సాయంత్రం నిర్ణయం?

Anchor Shyamala: ఏం చెప్పారు శ్యామలగారు.. భూమనను మించిపోయారుగా!

Tirumala News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నెల దర్శన కోటా విడుదల వివరాలు ఇవే

Iconic Cable Bridge: కృష్ణానదిపై ఐకానిక్‌ కేబుల్‌ బ్రిడ్జి.. సీఎం చంద్ర‌బాబు అదిరిపోయే ప్లాన్‌

AP Assembly Sessions 2025: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసు.. తెరపైకి కొత్త పేర్లు, నేతల గుండెల్లో గుబులు

Big Stories

×