Gundeninda GudiGantalu Today episode September 18th : నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్ వర్కర్స్ ని రమ్మని పిలుస్తాడు.. మీరు వయసు అయిపోయిన వాళ్ళు ఏం పని చేస్తారు. నాకు చేయాల్సిన అవసరం లేదు వెళ్ళిపోండి అని వర్కర్స్ ని దారుణంగా అవమానిస్తాడు మనోజ్. మేము పని చేయకుండానే ఈ షాపు ఎంత బాగా రన్ అవుతుందా సార్ మీరు ఒకసారి ఊహించకండి ఆలోచించండి విషయం గురించి అని వర్కర్స్ చెప్తారు. చెమటోడ్చి రక్తం చిందించి మేము ఇక్కడ పనిచేశాము అని వాళ్లంటారు. ఆ రక్తానికి వయసు అయిపోయింది మీరు వెళ్ళొచ్చు నేను ఎక్స్టర్స్ ని పెట్టుకున్నాను అని అంటాడు. నువ్వు ఎలా బాగుపడతావో మేము చూస్తాము అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు వర్కర్స్.. ఇక అలసిపోయి ఇంటికి వచ్చిన మనోజ్ ని ప్రభావతి దిష్టి తీసి ఇంట్లోకి రమ్మని చెప్తుంది.అటు మనోజు అందరికీ ఆర్డర్లు వేస్తూ ఉంటాడు. ఇవన్నీ చేయడానికి నీ దగ్గర పనిమనిషిని ఏమైనా ఉన్నారా నువ్వు నీ పెళ్ళాన్ని అడుగు నీకు కావలసినవన్నీ చేసిపెడుతుంది అని బాలు దిమ్మ తిరిగిపోయేలా సెటైర్లు వేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రభావతి మనోజ్ లేచాడేమో చూసి గదిలోకి వెళ్లి కాఫీ ఇవ్వమని ఆర్డర్ వేస్తుంది. కానీ నేను ఇవ్వను అని నేను అంటుంది. ఆయనకు పెళ్లయింది కదా ఆయన వాళ్ళ భార్య ఇస్తుందిలే తాగుతాడులే అని వెటకారంగా సమాధానం చెబుతుంది. మీనా. అప్పుడే రోహిణి అక్కడికి వచ్చి మనోజ్ ఎంత లైఫ్ లో లేవట్లేదు అని అంటుంది. నేను ఎంత ట్రై చేసినా కూడా లేవట్లేదు అత్తయ్య అనగానే మీనా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది.
ప్రభావతి మీనా నవ్విందని దిగులు పడుతుంది. ఇక మనోజ్ ని ఇప్పటికైనా నిద్రలేపి షాప్ కి వెళ్ళమని చెప్పమని ప్రభావతి పై సీరియస్ అవుతాడు సత్యం. అదేంటి శృతి రవి ఇద్దరు కూడా రెడీ అయ్యి కిందకి దిగివస్తారు. అయితే ప్రభావతిని వాన్ని లేపి షాప్ కి వెళ్ళమని చెప్పు అని సత్యం అంటాడు.. మనోజ్ ని మెల్లగా నిద్ర లేపుతుంది అందరూ చూసి నవ్వుకుంటారు. అయితే మనోజ్ ఎంతసేపటికి నిద్రలేవడు. బాలు మగ్గుతో నీళ్లు తెచ్చి మొహాన కొడతాడు.. ఏంట్రా ఇలా చేసావు నేను నీళ్లలో మునిగిపోతున్న అమ్మ అని మనోజ్ వెటకారం గా అంటాడు.
అరే రెండు రోజే దివాళ తెలిసిందని షాపుకు వెల్లవెంటి అని బాలు అంటాడు.. ఇక రోహిణి లే మనోజ్ వీళ్ళందరూ నిన్ను ఎగతాళి చేసి మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను. రెడీ అవ్వు తొందరగా షాప్ కి వెళ్ళు అనేసి అంటుంది. ప్రభావతి మీన దగ్గరకు వచ్చి మధ్యాహ్నం కి మటన్ వేపుడు చికెన్ చేసి పెట్టు మనోజ్ షాప్ కి వెళ్లి ఇచ్చి రావాలి అనేసి అంటుంది… ఎందుకు చేయాలి ఇంట్లో అందరికీ చేయమంటే చేస్తాను కానీ వాళ్ళిద్దరికీ ప్రత్యేకంగా చేయమంటే నేను చెయ్యను అని అంటుంది.
ఆవిడ ఉంది కదా ఆవిడ చేసి పెడుతుంది నాకేం అవసరం అని మీనా అంటుంది. ఇక బాలు బయట కారు నీ తుడుచుకుంటూ ఉంటాడు శోభన పంపిన సోఫా ఇంటికొస్తుంది. సురేంద్ర గారు బుక్ చేశారు మీ ఇంట్లో సోఫా కావాలని అని వచ్చిన వాళ్ళు చెప్తారు.. అయితే బాలు వెంటనే శోభన కి ఫోన్ చేసి నా పేరు బాలు అంటారండి మీరు పంపించిన సోఫా మీరే తీసుకోండి మాకేం వద్దు అని ఫోన్ పెట్టేస్తాడు. సురేంద్ర మాస్టర్ ప్లాన్ చేస్తాడు.. ఆ సోఫాను మల్లి షాప్ కి తీసుకెళ్లి శోభన రిటర్న్ ఇవ్వాలని అనుకుంటుంది.
Also Read : ప్రేమ భయాన్ని పోగొట్టేందుకు ధీరజ్ ప్లాన్.. నర్మదకు మాటిచ్చిన సాగర్.. శ్రీవల్లి మాస్టర్ ప్లాన్..
మీ ఇంటికి వస్తామని నేను పంపిస్తే ఆ సోఫా నీకు తిరిగి మళ్ళీ పంపించారు నాకు సోఫా అవసరం లేదు మా ఇంట్లో చాలానే ఉన్నాయి అని రిటర్న్ ఇస్తున్నాను. అయితే డబ్బులు ఇప్పుడే డీలర్కు ఇచ్చాను మీకు రెండు మూడు రోజుల సర్ది ఏర్పాటు చేస్తానని మనోజ్ అంటాడు.. అయితే రోహిణి మాత్రం ఆమెకు డబ్బులు తెచ్చి ఇస్తుంది. ఇంత డబ్బులు నీ దగ్గర ఎలా వచ్చాయో రోహిణి అని మనోజ్ అడుగుతాడు.. పుస్తెలతాడు తాకట్టు పెట్టి తీసుకొచ్చాను అని రోహిణి అంటుంది. ఇదంతా వాడి వల్ల జరిగింది వాడి సంగతి ఇంట్లో చెప్తాను అని మనోజ్ అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..