BigTV English
Advertisement

Tadepalli Palace: జగన్ ఇంటి సమీపంలో అగ్నిజ్వాలలు.. ఇది ఎవరి పని?

Tadepalli Palace: జగన్ ఇంటి సమీపంలో అగ్నిజ్వాలలు.. ఇది ఎవరి పని?

Tadepalli Palace: ఏపీలో ఏం జరుగుతోంది? తాడేపల్లిలో జగన్ ఇంటి సమీపంలో అగ్నిప్రమాదం మానవ తప్పిదమా? ఎవరైనా కావాలని చేశారా? మాజీ సీఎంకు భద్రత లోపం కనిపిస్తుందా? సిబ్బంది లేకుంటే పరిస్థితి ఏంటి? ఇవే ప్రశ్నలు వైసీపీ అభిమానులను వెంటాడుతున్నాయి.


తాడేపల్లి జగన్ ప్యాలెస్ గురించి చెప్పనక్కర్లేదు. ప్యాలెస్‌కు సమీపంలో ఏది జరిగినా పెద్ద న్యూస్ అవుతుంది. వైసీపీ అధికారంలోకి రాగానే వందల కోట్లు ఖర్చు చేసి దుర్భేద్యమైన కోటగా దాన్ని తీర్చిదిద్దారు. ఈ మధ్యనే ఈశాన్యం బరువు ఎక్కువగా ఉందని మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తోంది. అధికారం కోల్పోయిన తర్వాత ప్రత్యేకంగా ప్రైవేటు సెక్యూరిటీని నియమించుకున్నారు మాజీ సీఎం. వారంతా ప్యాలెస్ చుట్టూ కాపలా కాస్తున్నారు.

అధికారం కోల్పోయిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్‌కు చాలానే మార్పులు చేశారు జగన్. బెంగుళూరు నుంచి జ్యోతిష్యులను రప్పించారు. ఈశాన్యంలో బరువు ఎక్కువగా ఉండడంతో ఇబ్బందులు తప్పవని సలహా ఇచ్చారు. దీంతో కొంత పార్టు ఇనుప కంచె తొలగించినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి.


ప్యాలెస్ చుట్టూ ఎత్తుగా ఇనుప కంచె నిర్మిచారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటవాళ్లు లోపలికి వెళ్లే అవకాశం లేదు. ఇక అసలు విషయానికొద్దాం.. గడిచిన నాలుగు రోజులుగా ఏపీలో ఎండలు భగభగమంటున్నాయి. రాత్రివేళ కాస్త చల్లగా ఉన్నా, పగటి వేళ ఉష్టోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం రెండుసార్లు జగన్ ప్యాలెస్ చుట్టూ మంటలు చెలరేగాయి. దీంతో అలర్టయిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే వాటిని అదుపులోకి తెచ్చారు.

ఇంటి బయట రోడ్డు పక్కనున్న గార్డెన్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ తాగి పడేయడంతో మంటలు అంటుకున్నట్లు సమాచారం. ఎండకు గడ్డి బాగా ఎండిపోయి ఉండడంతో నిప్పు అంటుకుని ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. సెక్యూరిటీ సిబ్బంది, ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలు ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం సమయంలో కూడా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.

ALSO READ: సనాతన బోర్డు ఏర్పాటుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్ మ్యాప్ సిద్ధం

ఒకేరోజు రెండుసార్లు అగ్ని కీలలు ఎగిసిపడడంతో తాడేపల్లిలో ఏం జరుగుతోందన్న చర్చ ఇంటాబయటా మొదలైంది. గురువారం కార్పొరేటర్లలో సమీక్షా సమావేశం నిర్వహించారు అధినేత జగన్. సమావేశంలో వారికి చెప్పాల్సిన మూడు ముక్కలు చెప్పారు. సమావేశం తర్వాత తాడేపల్లి నుంచి జగన్ బెంగుళూరుకు వెళ్లినట్టు సమాచారం.

ఇక అగ్ని ప్రమాదం గురించి వైసీపీ నేతలు, కార్యకర్తలు రకరకాలుగా మాట్లాడు కుంటున్నారు. కొందరు అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా మాట్లాడుకోవడం వినిపిస్తోంది. చేసిన పాపాలు ఊరికే పోవదని కొందరంటున్నారు. కావాలనే చేశారని అంటున్నవాళ్లూ లేకపోలేదు. మొత్తానికి రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం గురించి ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

ప్రభుత్వం మాత్రం జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. అగ్నికీలల వెనుక ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ వ్యవహారాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకుంటుందా? సమ్మర్ సీజన్‌లో ఇలాంటి సహజమేనని లైట్‌గా తీసుకుంటుందా? అనేది చూడాలి.

 

Related News

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Srikakulam News: ఏడు గంటలపాటు సీదిరి అప్పలరాజు విచారణ.. అదే సమాధానం, మరోసారి పిలుపు

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Big Stories

×