Thallikivandanam Scheme: చంద్రబాబు సర్కార్ ‘తల్లికి వందనం’ స్కీమ్ ఎలా సక్సెస్ చేయగలిగింది? ఫ్యామిలీలో ఒకరికి ఇస్తే ప్రజలు తమను ఆదరించారని వైసీపీ ఇన్నాళ్లు భావించింది. పథకాల పేరుతో ఖజానా ఖాళీ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా మనకంటే ఎక్కువ మందికి ఎలా ఇచ్చిందనేది వైసీపీలో ఇంటాబయటా ఒకటే చర్చ. మిగతా స్కీమ్‌లు అమలు చేస్తే తమ పరిస్థితి ఏంటన్నది ఆ పార్టీకి చెందిన కొందరి నేతల మాట.
పిల్లల చదువు మధ్యలో ఆపకుండా కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ‘తల్లికి వందనం’. దీనికింద అర్హులైన ప్రతి విద్యార్థికి ఏటా 15 వేల రూపాయలను తల్లుల బ్యాంక్ అకౌంట్‌లో జమ చేయనుంది. కేవలం ప్రభుత్వం పాఠశాలలే కాకుండా ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఇస్తోంది. కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదివితే అందరికీ ఈ సాయం వర్తించనుంది. ఒకటి నుంచి ఇంటర్ వరకు విద్యార్థికి 13 వేలు చొప్పున ఇవ్వనుంది. పాఠశాల లేదా కాలేజీ నిర్వహణ 2 వేలు కేటాయిస్తారు. విద్యార్థికి ఇచ్చే మొత్తాన్ని తల్లి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. తల్లి లేకుంటే తండ్రి. తల్లిదండ్రులు లేకుంటే సంరక్షకుడి ఖాతాలో జమ చేస్తుందని ప్రభుత్వం.
తల్లికి వందనం పథకానికి కావాలంటే వాటిని ఫాలో కావాల్సిందే. దరఖాస్తు చేసుకునే వ్యక్తి రాష్ట్ర నివాసి అయి ఉండాలి. విద్యార్థి ఒకటి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలలో చదవాలి. విద్యార్థికి కనీసం 75 శాతం హాజరు తప్పనిసరి ఉండాల్సిందే. విద్యార్థి తల్లి పేరు మీద కచ్చితంగా బ్యాంక్ ఖాతా ఉండాలి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలు అర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ తదితర ప్రజా ప్రతినిధుల పిల్లలు దీనికి అర్హులు కారు.
ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. ఆయా పాఠశాలల నుంచి డేటాను సేకరించిన తర్వాత లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. తొలుత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించాలి. ఈ పథకం కింద పేరు నమోదు చేయించుకోవాలి. విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షల కంటే తక్కువ ఉన్నవారికే మాత్రమే వర్తిస్తుంది. గతంలో వైసీపీ అమలు చేసిన ‘అమ్మ ఒడి’ మార్గదర్శకాలను తల్లికి వందనం స్కీమ్‌కి వర్తిస్తున్నట్లు సీఎం చంద్రబాబు స్వయంగా తెలిపారు. కొత్తగా ఈ పథకం కింద చేరేందుకు త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయనుంది ప్రభుత్వం.
ALSO READ: ఏపీలో మహిళలకు తీపి కబురు.. 18 ఏళ్ల దాటితే చాలు 18 వేలు మీ సొంతం
తల్లికి వందనం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఆన్‌లైన్ విధానం ఇంకా రాలేదు. ఈ పథకం కోసం ప్రత్యేకంగా అధికారిక వెబ్‌సైట్, దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని భవిష్యత్తులో తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక తల్లికి వందనం పథకానికి ఆయా పత్రాలు కచ్చితంగా ఉండాల్సిందే. విద్యార్థి, తల్లి పేరు మీద ఆధార్ కార్డు ఉండాలి. తల్లి పేరు మీద ఉన్న బ్యాంక్ ఖాతా వివరాలు, పాఠశాల రికగ్నిషన్ సర్టిఫికెట్ ఉండాలి. అలాగే ఆదాయ ధృవీకరణ పత్రం చాలా ముఖ్యమైనది. ఆ తర్వాత అడ్రస్ ప్రూఫ్, అంటే ఆధార్ సరిపోతుంది. విద్యార్థి పాఠశాల హాజరు వివరాలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు విద్యార్థి, తల్లి ఉండాలి.
ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనువారు కచ్చితంగా విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో అనుసంధానించడం చేయాలి. సంబంధిత బ్యాంకుకు వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. మీ సేవా కేంద్రాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ చేయడం వల్ల లబ్ధిదారుల గుర్తించవచ్చు. నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉండదు. దీంతోపాటు తల్లి, వారి పిల్లల వివరాలను హౌస్ హోల్డ్ డేటా బేస్‌లో నమోదు కావాలి. అందులో ఈకేవైసీ చేయాలి. అలాగే విద్యార్థి తల్లి బ్యాంక్ అకౌంట్‌కు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసి ఉండాలి.