Prithivee Raj: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరోగా తెలుగు తమిళ కన్నడ భాషలలో వరుస సినిమాలు చేస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు పృథ్వీరాజ్ (Prithivee Raj)ఒకరు. ఈయన బాలనటుడిగా బబ్లూ అనే సినిమాలో నటించారు . అనంతరం హీరోగా తెలుగు తమిళ భాష చిత్రాలలో నటించడమే కాకుండా విలన్(Villain) పాత్రలలో కూడా తనకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చాయి. ఇక ఈయన పెళ్లి సినిమాలో విలన్ పాత్రలో ఎంతో అద్భుతమైన నటనను కనబరిచారు. ఈ సినిమాలో తన నటనకు గాను ఏకంగా నంది అవార్డు (Nandi Award)రావడం విశేషం.
చిరంజీవితో నటించడం..
ఇలా తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న పృథ్వీరాజ్ అవకాశాలు తగ్గిపోవడంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈయన తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.. ఇలా ఇండస్ట్రీలో విలన్ పాత్రలలోను, సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రెమ్యూనరేషన్ ఇవ్వను..
చిరంజీవి ఎంతోమంది హీరోలకు అభిమాన హీరో మాత్రమే కాకుండా ఎందరికో స్పూర్తిగా నిలిచారు.. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకోవడంతో చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక చిరంజీవి గారు అంటే తనకు కూడా విపరీతమైన అభిమానమని పృథ్వీరాజ్ తెలియచేశారు. అయితే ఈ విషయం గురించి యాంకర్ ప్రశ్నిస్తూ ఒకవేళ చిరంజీవి గారు నా సినిమాలో నీకు ఒక చిన్న పాత్రలో నటించే అవకాశం ఇస్తాను కానీ రెమ్యూనరేషన్ ఇవ్వను అంటే నటిస్తారా? అని ప్రశ్న వేశారు.
నా చెయ్యి నరికి ఇవ్వమన్నా ఇస్తా…
ఈ ప్రశ్నకు పృథ్వీరాజ్ సమాధానం చెబుతూ… చిరంజీవి గారు నన్ను పిలిచి నా సినిమాలో నీకు ఒక్క షాట్ ఇస్తాను నీ కుడి చెయ్యి నాకు ఇచ్చేస్తావా అంటే కూడా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ఈయన చిరంజీవిపై తనకున్న అభిమానం గురించి బయటపెట్టారు. అదేవిధంగా చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఎంతలా ఎదురుచూస్తున్నారో కూడా స్పష్టంగా తెలియజేశారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి చిరంజీవి కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో ఒక చిన్న పాత్రలో ఇచ్చిన తాను నటించడానికి సిద్ధంగా ఉన్నానని ఈయన తన మనసులో కోరికను బయటపెట్టారు. మరి చిరంజీవి పట్ల ఇంత అభిమానాన్ని చూపిస్తున్న పృథ్వీరాజ్ కు చిరంజీవి ఒక్కసారైనా అవకాశం ఇస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.