DIG Koya Praveen: ఎట్టకేలకు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రరెడ్డిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ సంచలన విషయాలను వెల్లడించారు.
ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డ పలువురిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అందులో ప్రధానంగా వర్రా రవీంద్ర రెడ్డి అరెస్ట్ పర్వం ఒక సంచలనమేనని చెప్పవచ్చు. వర్రాను అరెస్ట్ ఉదంతంలో జరిగిన చిన్నపాటి తప్పుతో, ఏకంగా కడప జిల్లా ఎస్పీ బదిలీ జరిగినట్లు వార్తలు కూడా హల్చల్ చేశాయి. ఈ నేపథ్యంలో వర్రా అరెస్ట్ పై అసలు ఏం జరుగుతుందనేది ప్రశ్నార్ధకంగా మారింది.
ఇలాంటి సమయంలోనే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ.. అతడి అరెస్ట్ ను స్వాగతిస్తూ ట్వీట్ కూడా చేశారు. అలాగే వర్రా సతీమణి కూడా కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి సమయంలో వర్రాను అరెస్ట్ చేసినట్లు, కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ తాజాగా మీడియా ముందు ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. గత వారం రోజులుగా సోషల్ మీడియా సైకోలపై తాము ప్రత్యేక దృష్టి సారించామని, వర రవీంద్రారెడ్డి తో పాటు సుబ్బారెడ్డి, ఉదయ్ లను అరెస్టు చేశామన్నారు. మహిళలపై అసభ్యంగా పోస్టులు పెట్టడంలో వర్రా సిద్ధహస్తుడని, అయితే ఇదంతా రాష్ట్రవ్యాప్తంగా ఆర్గనైసేడ్ చేసిన వ్యవహారంగా పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు. సజ్జల భార్గవ్ ఆధ్వర్యంలో సోషల్ మీడియాలో బూతు పురాణం ప్రారంభించినట్లు వరా రవీంద్రారెడ్డి అంగీకరించినట్లు, వీరి అధ్వర్యంలో 40 సోషల్ మీడియా టీం లను గుర్తించామన్నారు.
Also Read: Astrologer Krishnamacharya: జగన్ జీవితంలో ఏం జరగబోతోంది? స్త్రీతో ప్రమాదమా? ఎవరు ఆమె?
అలాగే 40 యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకొని, సజ్జల భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో 400 మంది పని చేసినట్లు తాము గుర్తించామని తెలిపారు. పంచ్ ప్రభాకర్, వెంకటేష్ బాడీ, బేతంపూడి నాని, కీసర రాజశేఖర్ రెడ్డి, హరికృష్ణ రెడ్డి కల్లం లాంటి వారిని తాము గుర్తించామని, వర్రా రవీంద్రారెడ్డిని పోలీస్ కస్టడికి కోరనున్నట్లు డిఐజి తెలిపారు. కాగా వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్ సమయంలో భార్య కళ్యాణి మీడియాతో మాట్లాడారు. తన భర్తకు ఏదైనా జరిగితే ప్రభుత్వానితే బాధ్యత అని, తన భర్తను వారం రోజులుగా పోలీసులు వేధించినట్లు ఆమె పోలీసులపై విమర్శలు చేశారు.