BigTV English

Chandrababu : వైసీపీ హయంలో ఆక్వారంగం నాశనం.. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలని డిమాండ్..

Chandrababu : వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలను హెచ్చరించారు. కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగసభలో ఆయన పాల్గోన్నారు. జగన్ ప్రభుత్వంలో ఆక్వారంగం అభివృద్ది చెందలేదని విమర్మించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా ఆక్వారంగం అభివృద్ది చేస్తామని తెలిపారు. ఆక్వా రైతులకు విద్యుత్‌పై రాయితీ ఇస్తామని ప్రకటించారు. వైసీపీ పాలనలో రైతులు ఎవరైనా సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. రైతుల నుంచి ధాన్యం కొనడం లేదని మండిపడ్డారు. పంటకు గిట్టు బాటు ధర కూడా ఇవ్వడం లేదని ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు.

Chandrababu : వైసీపీ హయంలో ఆక్వారంగం నాశనం.. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలని డిమాండ్..

Chandrababu : వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలను హెచ్చరించారు. కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగసభలో ఆయన పాల్గోన్నారు. జగన్ ప్రభుత్వంలో ఆక్వారంగం అభివృద్ది చెందలేదని విమర్మించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆక్వారంగం అభివృద్ది చేస్తామని తెలిపారు. ఆక్వా రైతులకు విద్యుత్‌పై రాయితీ ఇస్తామని ప్రకటించారు.


టీడీపీ పాలనలో ఆక్వారంగం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆక్వా రైతులు నిండా మునిగిపోయారని ప్రభుత్వం‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రైతులు ఎవరైనా సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. రైతుల నుంచి ధాన్యం కొనడం లేదని మండిపడ్డారు. పంటకు గిట్టు బాటు ధర కూడా ఇవ్వడం లేదని ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. పంటలకు సాగునీరు ఇచ్చిన కాటన్‌ దొరను ఇప్పటికీ ఈ ప్రాంతపు రైతులు పూజిస్తారని చంద్రబాబు తెలిపారు.

ఆకలి తీర్చిన అన్నపూర్ణ.. డొక్కా సీతమ్మ ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తే అని గుర్తు చేశారు. ప్రభుత్వం కాలువలు బాగు చేయకుండా పంటలను నాశనం చేసిందని ఆరోపించారు. తాము ప్రారంభించిన పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ఉంటే జిల్లాకు సాగునీరు అందేది అని అన్నారు. ఆక్వా రైతులకు సీఎం జగన్ అనేక హామీలను ఇచ్చారని పేర్కొన్నారు. వాటిని అమలు చేయకుండా ఆక్వా రైతులను‌ మోసం చేశారని చంద్రబాబు జగన్ పై విమర్శలు గుప్పించారు.


Related News

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: మా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Big Stories

×