BigTV English

Amaravathi: కూటమి గెలుపుతో.. అమరావతికి మంచిరోజులు రాబోతున్నాయా?

Amaravathi: కూటమి గెలుపుతో.. అమరావతికి మంచిరోజులు రాబోతున్నాయా?

నిజానికి రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని క్యాపిటల్‌గా ప్రకటించింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. దీంతో చాలా మంది అక్కడ భూములు కొనుగోలు చేశారు. రియల్ భూమ్‌ ఒక్కసారిగా పెరిగింది. రియల్ ఎస్టేట్‌ వ్యాపారులు భారీగా భూములు కొనుగోలు చేశారు. రైతులు సైతం 33 వేల ఎకరాలు రాజధాని కోసం ఇచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపుతో సీన్ మారిపోయింది. అమరావతి నిర్లక్ష్యానికి గురైంది. దీంతో రైతులు ఉద్యమబాట పట్టారు. వ్యాపారులు నిరాశలో కూరుకుపోయారు. మళ్లీ ఇప్పుడు అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల్లో ఆనందం కన్పిస్తుంది. చంద్రబాబు సీఎం కావడం తమ అదృష్టమన్న భావనలో ఉన్నారు.

అమరావతిని గ్రీన్‌ఫీల్డ్ క్యాపిటల్‌గా నిర్మించేందుకు చంద్రబాబు ముందుగా 50 వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని అనుకున్నారు. 2016లో బాబు అమరావతిలో తొమ్మిది థీమ్ నగరాలు. 27 టౌన్‌షిప్‌ల కోసం ప్రణాళికలను ప్రకటించారు.. ఇవన్నీ అటకెక్కాయి. ఇప్పుడు మళ్లీ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్స్‌ మళ్లీ జోరుగా కొనసాగడం పక్కాగా కనిపిస్తోంది. స్టిల్‌ 21 వేల 95 ప్లాట్లు ఇంకా రిజిస్ట్రేషన్ పెండింగ్‌లో ఉన్నాయి.. ఇవన్నీ మళ్లీ పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. మినీ జంగిల్‌గా మారిన అమరావతిని మళ్లీ మాములుగా చేసేందుకు ఇప్పటికే అధికారులు పరుగులు పెడుతున్నారు. ఐదేళ్లుగా పారిశుద్ధ్యాన్ని మరిచిన సిబ్బంది అంతా ఇప్పుడు కదిలారు. ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపనం చేసిన ప్రాంతంలో పిచ్చిమొక్కలు తొలగించి క్లీన్ చేశారు. సీడ్‌యాక్సిస్ రోడ్డు సైతం క్లీన్‌గా మారింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో కొత్తగా సెక్యూరిటీ సిబ్బంది కనిపిస్తున్నారు.


Also Read: రామ్మోహన్ నాయుడికి కేంద్రమంత్రి పదవి.. మొదటిసారి పోటీ చేసి గెలిచిన మరో ఎంపీకి కూడా మోదీ కేబినెట్‌లో చోటు

అయితే అమరావతిని క్యాపిటల్‌గా అనౌన్స్ చేయడం అంత ఈజీనా? నిజానికి సుప్రీంకోర్టులో దాదాపు ఏడాదిన్నార కాలంలో రాజధాని వ్యవహారం విచారణలో ఉంది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు సమంజసంగా లేదని రాజధాని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమంటూ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సో కొంచెం లీగల్‌గా లిటికేషన్స్ ఉన్నాయి. బట్ వీటిని తొలగించడానికి పెద్ద టైమ్ పట్టదు. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయగానే..కొత్త మంత్రివర్గంతో భేటీ కానున్నారు. ఆ భేటీలోనే అమరావతికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పు పైన చేసిన అప్పీల్ ను ఉపసంహరించుకొనేందుకు కావాల్సిన చర్యలు తీసుకోనున్నారు. సుప్రీంలో కేసు ఉపసంహరణ తరువాత అసెంబ్లీలో రాజధానిపైన తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారం పైన న్యాయసలహాలు తీసుకొని అమరావతి రాజధానిగా అధికార ప్రక్రియ పూర్తి చేసేలా సిద్దం అవుతున్నారు చంద్రబాబు.

ఇదంతా జరిగేందుకు కాస్త సమయం పడుతుంది. ఆలోపు అమరావతి భూముల రెట్లు మళ్లీ ఆకాశాన్నట్టడం పక్కా.. ఇప్పటికే భూముల కొనుగోళ్లు, అమ్మకాలపై మళ్లీ చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చే లోపు ఇప్పుడు భూములు చేతులు మారనున్నట్టు తెలుస్తోంది. దీంతో రాజధాని ప్రాంతంలో భూములున్న వారంతా ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు.

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×