BigTV English

Pawan Kalyan: నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకున్న ఆడపిల్లలు: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకున్న ఆడపిల్లలు: పవన్ కళ్యాణ్

TDP-JSPChandrababu: తణుకు సభలో వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. అన్నం పెట్టే రైతునే ఈ వైసీపీ ప్రభుత్వం ఏడిపించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం అని చంద్రబాబు జోస్యం చెప్పారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో తణుకు, నిడదవోలు నియోజకవర్గం ప్రజా గళం, వారాహి విజయ భేరి బహిరంగ సభల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు, బీజేపీ నేతలు పాల్గొన్నారు.


‘రాష్ట్రంలో సైకిల్ స్పీడ్ కు తిరుగు లేదు.. గ్లాస్ జోరుకు ఎదురు లేదు. రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడైంది.. ప్రజాగళానికి వారాహి తోడైంది ప్రజల కోసం నిలబడ్డ నిజమైన హీరో పవన్ కళ్యాణ్. అక్రమాల్ని ఎదుర్కోవడానికి పవన్ నిలబడ్డారు. వ్యక్తిగత దాడుల్ని తట్టుకుని పవన్ నిలబడ్డారు. చీకటి పాలన అంతం కావాలంటే.. ఓటు చీలకూడదని పవన్ చెప్పారు.

రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మూడు పార్టీలు చేతులు కలిపాయి. మాడు పార్టీలు కలిశాక.. వైసీపీకి డిపాజిట్లు వస్తాయా..?. యువత కన్నెర్ర చేస్తే జగన్ లండన్‌కు పారిపోతారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం. జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి’ అని చంద్రబాబు ప్రజలను కోరారు.


‘జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. మా పదవుల కోసం మేము పాకులాడటం లేదు. రాష్ట్రానికి ఇప్పుడు కేంద్రం సహాయం అవసరం. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అండగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్.. నేను గానీ తెలుగుదేశం పార్టీ గానీ ఎప్పటికీ పవన్ కళ్యాణ్ ను గుర్తుపెట్టుకుంటాం’ అని చంద్రబాబు అన్నారు.

‘నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకున్న ఆడపిల్లలు. ఇస్రోకు ఇంధనాన్ని అందిస్తున్న ఏపీ.. అన్నం పెట్టిన రైతును ఏడిపించిన పౌరసరఫరాల మంత్రి.. ఎన్నికల్లో మంత్రి, ఆయన కొడుకు తుడిచిపెట్టుకుపోవాలి.

విభజన జరిగినప్పటి నుంచి మనకి అన్యాయం జరుగుతోంది. పార్టీలు వీడిపోతే మళ్లీ దుర్మార్గులు రాజ్యం ఏలుతారు. అన్నం పెట్టే రైతును ఈ ప్రభుత్వం ఏడిపించింది. చంద్రబాబు సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి.. సైబర్ సిటీకి చంద్రబాబు రూపకల్పన చేశారు.

పోలవరం పూర్తి అయ్యిందా అంటే.. ఇరిగేషన్ మంత్రి డ్యాన్స్ లు చేస్తుంటాడు. బూతులు తిట్టే దాడులు చేసే మంత్రులు.. వైసీపీ కేబినెట్ లో ఉన్నారు. దోపిడీపై దృష్టి ఉన్న నేతలు.. ప్రజల అవసరాన్ని ఎలా తీరుస్తారు. పోలీసుల శ్రమశక్తిని జగన్ దోచుకుంటున్నారు. ప్రజల భవిష్యత్ కోసం రోడ్లపైకి వచ్చి కొట్లాడాల్సి వస్తోంది. టీడీఆర్ బాండ్ల పేరుతో డబ్బులు దోచుకున్నారు. ఇక్కడ దోచుకున్న సొమ్ముతో మరోచోట పరిశ్రమలు పెట్టుకుంటున్నారు’ అని పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వం పనితీరుపై ధ్వజమెత్తారు.

Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×