BigTV English
Advertisement

Chandrababu: ‘చిల్లర రాజకీయాలు వద్దు.. గౌరవంగా రాజకీయాలు చేర్చుకో జగన్’..

Chandrababu: ‘చిల్లర రాజకీయాలు వద్దు.. గౌరవంగా రాజకీయాలు చేర్చుకో జగన్’..
Chandrababu comments on Jagan

Chandrababu comments on Jagan(AP political news): వైసీపీ సర్కారుకు కౌంట్‌డౌన్‌ మొదలైందని.. 52 రోజుల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహించిన ‘రా.. కదలిరా’ సభలో ఆయన మాట్లాడారు. జగన్‌కు అభ్యర్థులు దొరక్క సందిగ్ధంలో పడ్డారన్నారు. అవినీతి, నల్లధనం, అక్రమాలతో ఆయన రాజకీయాలు చేస్తున్నారన్నారు.


రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి జగన్ అని చంద్రబాబు పేర్కొన్నారు. పేర్కొన్నారు. చిల్లర రాజకీయాలు వద్దు.. గౌరవంగా రాజకీయాలు చేయడం నేర్చుకోని జగన్ కు చంద్రబాబు హితువు పలికారు.

వైనాట్‌ పులివెందుల అనేదే తమ నినాదం అని చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ రాజకీయాలను కలుషితం చేశాడన్నారు.వైసీపీను ఓడించి ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. పర్చూరు సభను చూస్తే జగన్‌కు ఇక రాత్రి నిద్ర పట్టదన్నారు. పర్చూరు సభను అడ్డుకునేందుకు జగన్‌ అన్ని విధాలుగా ప్రయత్నించారన్నారు.


పోలీసుల అండతో జగన్ ప్రభుత్వం అక్రమ మైనింగ్ పనులు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ప్రశ్నించిన ఏలూరి సాంబశివరావు, గట్టిపాటి రవి పైనా కేసులు పెట్టారన్నారు. జగన్ అవినీతికి అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోయిందన్నారు. ఆయన ముక్కుకు కళ్లెం వేసే రోజులు దగ్గర పడ్డాయన్నారు.

పోయే ప్రభుత్వాన్ని మోస్తే పోలీసులే మునిగిపోతారని చంద్రబాబు అన్నారు. టీడీపీ సభను అడ్డుకోవడానికి ప్రయత్నించారన్నారు. నోటీసులో ఏం ఉందో చూడకుండా సభ ఆపాలని ఎస్పీ అంటారా? ప్రశ్నించారు. మనం చట్ట ప్రకారం వెళ్తున్నామన్నారు.. అడ్డం వస్తే తొక్కుకుని పోతామని హెచ్చరించారు. జగన్‌ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికలకు ముందే మన గెలుపు ఖాయమైందన్నారు. పర్చూరు నియోజకవర్గంలో గ్రానైట్‌ వ్యాపారులపై వైసీపీ నేతలు కేసులు పెట్టించి వేధించారన్నారు.

Read More: ఫైబర్‌నెట్ కేసులో కేసులో సీఐడీ దూకుడు.. ఏ1గా చంద్రబాబు

మైనింగ్‌ అధికారులు వైసీపీ మూకలతో వెళ్లి వ్యాపారులను బెదిరించారని చంద్రబాబు అన్నారు. అధికారం ఉందని ఆంబోతుల మాదిరిగా ఊరు మీద పడ్డారన్నారు. గొట్టిపాటి రవికుమార్‌కు రూ.3 వేల కోట్ల జరిమానా విధించారని పేర్కొన్నారు. తనతో పాటు పవన్‌ కల్యాణ్‌ కూడా వైసీపీ బాధితులమేనని పేర్కొన్నారు. మాట్లాడితే జగన్‌ బటన్ నొక్కానని చెబుతున్నారు. అందుకే ఆర్టీసీ, విద్యుత్‌ ఛార్జీలు పెరిగాయన్నారు.

రాష్ట్రంలో చెత్త, నీరు, ఆస్తిపై పన్నులు పెంచారని చంద్రబాబు అన్నారు. మద్యపాన నిషేధం, జాబ్‌ క్యాలెండర్‌పై జగన్‌ ఎందుకు బటన్‌ నొక్కలేదని ఆయన ప్రశ్నించారు. జగన్‌ పెట్టే ప్రతి స్కీమ్‌ వెనుక స్కామ్‌ ఉంటుందన్నారు. ఇలాంటి దోపిడీ ఎప్పుడూ చూడలేదన్నారు.

అమరావతి రాజధాని అని జగన్ అసెంబ్లీలో చెప్పారని చంద్రబాబు అన్నారు. మాట మార్చి 3 రాజధానులు అన్నారన్నారు. ఇప్పుడు నాలుగో రాజధాని హైదరాబాద్‌ అంటున్నారన్నారు. అమరావతి నిర్మాణం ఆపి రాష్ట్రంలో ఉపాధి లేకుండా చేశారన్నారు. అమరావతి పూర్తయితే రాష్ట్రం పరిస్థితి మరోలా ఉండేదని పేర్కొన్నారు. ఆనాడు బీజేపీతో విభేదించింది ప్రజల కోసం.. రాష్ట్రం కోసమేనని ఆయన అన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్‌ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కేంద్రం సాయం చేస్తామన్నా.. తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నారు.

Related News

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Lokesh Praja Darbar: లోకేష్ ప్రజా దర్బార్.. పల్లా ఆసక్తికర వ్యాఖ్యలు..

Rain Alert: ఆవర్తనం ఎఫెక్ట్.. నేడు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్..

VSKP-MBNR Train: విశాఖ-మహబూబ్‌నగర్ రైలుకు తప్పిన ముప్పు.. మార్గ మధ్యలో నిలుపువేత, ఏం జరిగింది?

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Big Stories

×