E-Paper
Advertisement

అమరావతి – బెంగళూరు – చెన్నై బుల్లెట్ రైలు కారిడార్.. అమిత్ షాకు సీఎం చంద్రబాబు బిగ్ ప్రపోజల్!

అమరావతి – బెంగళూరు – చెన్నై బుల్లెట్ రైలు కారిడార్.. అమిత్ షాకు సీఎం చంద్రబాబు బిగ్ ప్రపోజల్!
Advertisement

CM Chandrababu: ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానిస్తూ బుల్లెట్ రైలు తీసుకురావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. తమిళనాడులోని మహాబలిపురంలో అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి సీఎంలు హాజరయ్యారు. ఈ భేటిలో దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి గురించి సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. కేంద్ర రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారం జరగాలని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే ఏపీ, కర్ణాటక, తమిళనాడును అనుసంధానించే బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ ప్రతిపాదనను సీఎం చంద్రబాబు తెరపైకి తీసుకొచ్చారు. కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ నడపాలని కోరారు. అమరావతి – బెంగళూరు – చెన్నై నగరాలను అనుసంధానించే రవాణా వ్యవస్థ ఉండాలని స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్‌వర్క్, డ్రై పోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. దక్షిణాది విద్యుత్ గ్రిడ్‌ను జాతీయ గ్రిడ్‌తో అనుసంధానించాలన్నారు. దక్షిణాదిలోని యూనివర్సిటీలు, నైపుణ్యాభివృద్ధి సంస్థలతో ఉమ్మడి కన్సార్టియం ఏర్పాటు చేయాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

అలాగే విపత్తుల సమయంలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే మ్యూచువల్ ఎయిడ్ ఫోర్స్ ఏర్పాటుకు చంద్రబాబు ప్రతిపాదన చేశారు. తిరుపతి నుంచి కాశీ, అయోధ్య, చార్‌ధామ్ వరకు ఉమ్మడి ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేయాలన్నారు. మరోవైపు దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా సుమారు 31 శాతం ఉందన్న సీఎం.. 2047 నాటికి దక్షిణాది ఆర్థిక వ్యవస్థ 10 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందన్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో కీలక ఆర్థిక శక్తిగా దక్షిణాది రాష్ట్రాలు ఎదగాలనీ చంద్రబాబు ఆకాంక్షించారు.

పోలవరం, సౌత్ కోస్ట్ రైల్వే జోన్, అమరావతి ప్రాజెక్టులు.. కేంద్ర సహకారంతోనే సాకారం అవుతున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతికి చట్టబద్ధ రాజధాని హోదా సాధించామని.. వనరుల లోటు, సెక్షన్ 56లోని అంశాలను పరిష్కరించాలని అమిషాను కోరారు. దుగ్గరాజుపట్నం పోర్టు, రిఫైనరీ ప్రతిపాదనలకు వేగంగా అనుమతులు ఇవ్వాలన్నారు. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతిని కోరారు. అటు గోదావరి – కావేరి నదుల అనుసంధానంతో 500 టీఎంసీలకు పైగా నీటిని మళ్లించే ప్రతిపాదనను చంద్రబాబు తెరపైకి తీసుకొచ్చారు.

Advertisement

Also Read: ప్రకాశంలో తీవ్ర విషాదం.. అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి!

గోదావరి – కావేరి అనుసంధానంతో తమిళనాడు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చంద్రబాబు అన్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు కలిసి నదీ జలాలపై సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గంగా – కావేరి నదుల అనుసంధానానికి దీర్ఘకాలిక జాతీయ ప్రణాళిక అవసరమన్నారు. నదుల అనుసంధానంపై కాలపరిమితితో కూడిన డీపీఆర్‌లు, అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సహకారం, సమన్వయంతోనే దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమన్న సందేశాన్ని చంద్రబాబు ఇచ్చారు. కాగా, దక్షిణాది రాష్ట్రాల సమగ్రాభివృద్ధి గురించి మంచి విజన్ తో చంద్రబాబు మాట్లాడారని సౌత్ స్టేట్స్ ముఖ్యమంత్రులు ప్రశంసించారు.

Also Read: వందేమాతరం రచ్చ.. ఓటు బ్యాంక్ vs దేశ భక్తి.. కాంగ్రెస్‌‌ను చీల్చిచెండాడిన అమిత్ షా..!

Tags

Related News

అనకాపల్లి జిల్లాలో విషాదం.. హిట్ అండ్ రన్ ఘటనలో దంపతులు మృతి!

ఏపీలో స్పెషల్ టెట్-2026 హాల్ టికెట్లు విడుదల, షెడ్యూల్ ఇదే! ఫలితాలు మాత్రం

ఏపీలో లక్షన్నర కోట్ల BPCL రిఫైనరీ ప్రాజెక్టు.. పర్యావరణ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్, శంకుస్థాపనకు ప్రధాని

విజయవాడలో సైకో ప్రేమికుడు వీరంగం.. ఏం చేశాడంటే?

తిరుపతిలో ముగ్గురు వైద్యులపై ఉన్నతాధికారులు వేటు

ఏకపక్షంగా 14 ఆదేశాలా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిల ఫైర్!

దేశంలో తొలిసారి ఏపీలో 3 డీ హౌసింగ్ ప్రాజెక్ట్.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శంకుస్థాపన, జగన్‌పై విసుర్లు!

కదలికలు తెలుసుకుంటున్నారు.. మా వాళ్లను ట్రాప్ చేశారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి హాట్ కామెంట్స్

Big Stories

Advertisement
×