Nagababu Commnts: ఏపీలో సెకండ్ ఫేజ్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అంతేకాదు కొన్నిచోట్ల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా వైసీపీపై నాగబాబు చేసిన హాట్ కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇంతకీ నాగబాబు ఏమన్నారు? ఎందుకు వైసీపీ తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది?
ఏపీలోని రెండో విడత ఎన్నికలకు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు రెడీ అయ్యాయి. నామినేషన్ల ఘట్టం ముగియడంతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఈ విషయంలో కూటమి పార్టీలు జోరు పెంచాయి. ఎలాగైనా 23 పీఠాలు దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. అటు జనసేన కూడా అదే దూకుడు పెంచింది. ఎన్నికలు జరిగే ప్రాంతాలకు ఇన్ ఛార్జులను నియమించింది జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఎన్నికలు జరగనున్న శ్రీకాకుళం, కాకినాడ, భీమవరం, తాడేపల్లిగూడెం, రాజాం నియోజకవర్గాల పార్టీ బాధ్యతలను నాగబాబుకు అప్పగించారు.
ఆయన కూటమి నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. శుక్రవారం వెస్ట్ గోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెంకు వచ్చిన జనసేన ఎమ్మెల్సీ నాగబాబు, అక్కడి కూటమి నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాగబాబు, రాబోయే పదిహేనేళ్ళు కూటమి ప్రభుత్వం ఉంటుందని కుండబద్దలు కొట్టేశారు. కొట్లాది మంది ప్రజలు కూటమి వైపు ఉన్నారని, కేవలం 10 లేదా 20 మంది వైసీపీ వైపు ఉన్నారని తేల్చేశారు. జీవితంలో వైసీపీ పార్టీ ముఖం చూడకూడదని ప్రజలు డిసైడ్ అయ్యారని, అందుకే ఆ పార్టీని గెలిపించాలనే ఆలోచన వారికి లేదని చెప్పేశారు.
వైసీపీ బ్రతికున్నామనే భ్రమలో వారు తిరుగుతున్నారు..
వైసీపీ చనిపోయిన పార్టీ కనుచూపు మేర ఆ పార్టీ లేదు..వాళ్ళని మేము విమర్శించాల్సిన అవసరం లేదు
– ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు pic.twitter.com/p8UD3ZpK3m
— YK Tv Digital (@yktvdigital) November 20, 2026