Amaravati: ఏపీలో కూటమి ప్రభుత్వం రూటు మార్చింది. గడిచిన రెండున్నరేళ్లలో చేసిన పనులను చెప్పే ప్రయత్నం చేస్తోంది. తాజాగా మంత్రి లోకేష్ రూటు మార్చారు. కొత్త ప్రాజెక్టులు వచ్చినా, ప్రారంభోత్సవాలు జరిగినా దాని గురించి కేవలం ఏపీ కాకుండా దేశమంతా చర్చించుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్స్‌లో చేసిన పోస్టుపై పారిశ్రామికవేత్తలతోపాటు సామాన్యులు చర్చించుకుంటున్నారు.
ట్రెండ్ మారింది.. వేగంగా పనులు చేసే రోజులు వచ్చేశాయి. ఏ మాత్రం ఆలస్యమైనా పెట్టుబడులు రాష్ట్రాలకు రాని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం రూటు మార్చింది. వేగంగా పరిశ్రమలు నెలకొల్పేందుకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది. దీని ద్వారా కంపెనీలు పెట్టేవారి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆ మార్పుని చూసి పారిశ్రామిక వేత్తలు షాకవుతున్నారు.
తాజాగా ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ ఓ పోస్టు పెట్టారు. ఆసియాలో అతిపెద్ద పానీయాల తయారీ ప్లాంట్‌ని శంకుస్థాపన మొదలు కేవలం 12 నెలల్లో తన కార్యకలాపాలను ప్రారంభించనుందని రాసుకొచ్చారు. దీన్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ప్రస్తావించారు. ఇంతకీ ఏ ప్లాంట్ అనేది శనివారం సాయంత్ర ఐదు గంటలకు వెల్లడి కానుందని తెలిపారు. దీనిపై ఏపీతోపాటు దేశవ్యాప్తంగా అప్పుడే చర్చ మొదలైంది.
ALSO READ: వైసీపీ చనిపోయిన పార్టీ.. బ్రతికున్నామనే భ్రమలో ఆ పార్టీ నేతలు, నాగబాబు హాట్ కామెంట్స్‌పై చర్చ
Asia’s largest beverage plant with 10 lines went from ground-breaking to commissioning in just 12 months. It’s called #SpeedOfDoingBusiness
Which plant is this? BIG unveil: 5 PM today!
— Lokesh Nara (@naralokesh) November 21, 2026