E-Paper
Advertisement

ప్రకాశంలో తీవ్ర విషాదం.. అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి!

ప్రకాశంలో తీవ్ర విషాదం.. అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి!
Advertisement

Lift Accident: అపార్ట్ మెంట్లలో ఉండే లిఫ్ట్ లు యమపాశాలుగా మారుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో లిఫ్ట్ కారణంగా ఓ మహిళ ప్రాణాలు విడిచింది. డోర్ తెరిచి ఉండగానే లిఫ్ట్ ఒక్కసారిగా కిందకి కదలడంతో లిఫ్ట్ కు ఫ్లోర్ కు మధ్య మహిళ ఇరుక్కొని తీవ్రంగా గాయపడింది. అపార్ట్ మెంట్ వాసులు అప్రమత్తమై బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచింది. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

అసలేం జరిగిందంటే?

బాధితురాలిని 50 ఏళ్ల వనితగా గుర్తించారు. ఆదివారం రోజున ఈ విషాదకర ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కుమార్తె, మనువడితో కలిసి బాధితురాలు లిఫ్ట్ ఎక్కారు. తమ ఫ్లోర్ రాగానే కుమార్తె, మనవడు తొలుత బయటకు వచ్చారు. వనిత కూడా బయకు రాబోతున్న క్రమంలో ఒక్కసారిగా లిఫ్ట్ కిందకి కదిలింది. దీంతో ఆమె ప్రమాదకర రీతిలో లిఫ్ట్ కు ఫ్లోర్ కు మధ్యలో చిక్కుకుపోయారు. తీవ్రమైన నొప్పితో విలవిలలాడారు.

Advertisement

సకాలంలో స్పందించినా..

బాధితురాలి కేకలు విని.. అపార్ట్ మెంట్ వాసులు, స్థానికులు వెంటనే లిఫ్ట్ వద్దకు పరిగెత్తుకు వవ్చారు. తీవ్రంగా శ్రమించి వనితను బయటకు లాగారు. అనంతరం ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే ఆమె పరిస్థితి క్షీణించి.. ప్రాణాలు విడిచినట్లు వైద్యులు వెల్లడించారు.

ప్రమాదానికి కారణం అదేనా!

Advertisement

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో సదరు అపార్ట్ మెంట్ తో పాటు బహుళ అంతస్తు భవనాల్లో నివసించే వారు ఆందోళన చెందుతున్నారు. భవనాల్లోని లిఫ్ట్‌ల నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే లిఫ్ట్ తెరుచుకున్నప్పుడు అది కదలకుండా చేసే సెన్సార్లు విఫలం కావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: వందేమాతరం రచ్చ.. ఓటు బ్యాంక్ vs దేశ భక్తి.. కాంగ్రెస్‌‌ను చీల్చిచెండాడిన అమిత్ షా..!

రంగంలోకి పోలీసులు..

కాగా, లిఫ్ట్ హఠాత్తుగా కదలడానికి గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్‌కు సకాలంలో సర్వీసింగ్ చేశారా? లేదా? దీని వెనుక యాజమాన్యం నిర్లక్ష్యం ఏమైనా ఉందా? సాంకేతిక లోపం వల్లే జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Also Read: ప్రభుత్వం బంపరాఫర్.. పథకాలు ప్రమోట్ చేస్తే.. ఒక్కో వీడియోకు రూ.లక్ష బహుమానం!

Tags

Related News

అనకాపల్లి జిల్లాలో విషాదం.. హిట్ అండ్ రన్ ఘటనలో దంపతులు మృతి!

ఏపీలో స్పెషల్ టెట్-2026 హాల్ టికెట్లు విడుదల, షెడ్యూల్ ఇదే! ఫలితాలు మాత్రం

ఏపీలో లక్షన్నర కోట్ల BPCL రిఫైనరీ ప్రాజెక్టు.. పర్యావరణ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్, శంకుస్థాపనకు ప్రధాని

విజయవాడలో సైకో ప్రేమికుడు వీరంగం.. ఏం చేశాడంటే?

తిరుపతిలో ముగ్గురు వైద్యులపై ఉన్నతాధికారులు వేటు

ఏకపక్షంగా 14 ఆదేశాలా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిల ఫైర్!

దేశంలో తొలిసారి ఏపీలో 3 డీ హౌసింగ్ ప్రాజెక్ట్.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శంకుస్థాపన, జగన్‌పై విసుర్లు!

కదలికలు తెలుసుకుంటున్నారు.. మా వాళ్లను ట్రాప్ చేశారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి హాట్ కామెంట్స్

Big Stories

Advertisement
×