E-Paper
Advertisement

యాపిల్ ప్రియులకు మళ్లీ నిరాశే.. కెమెరా ఎయిర్‌పాడ్స్ వచ్చేది అప్పుడేనట!

యాపిల్ ప్రియులకు మళ్లీ నిరాశే.. కెమెరా ఎయిర్‌పాడ్స్ వచ్చేది అప్పుడేనట!
Advertisement

Apple Camera AirPods: టెక్ దిగ్గజం యాపిల్ నుంచి కెమెరాతో కూడిన కొత్త ఎయిర్‌పాడ్స్ రాబోతున్నాయనే వార్తలు గత కొన్ని రోజులుగా టెక్ ప్రియులను ఖుషీ చేశాయి. ఈ వార్తలకు బలం చేకూర్చేలా ఇటీవల మాకోస్ వెర్షన్‌లో వీటికి సంబంధించిన ఒక డెమో వీడియో కూడా బయటకు వచ్చింది. దీంతో ఇవి ఈ ఏడాదే మార్కెట్‌లోకి వస్తాయని అందరూ భావించారు. అయితే.. యాపిల్ ప్రియులను నిరాశపరుస్తూ ఈ ఎయిర్‌పాడ్స్ లాంచ్ కాస్త ఆలస్యం కానుందని సమాచారం.

2027లోనే దర్శనం..

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. యాపిల్ తమ కెమెరా ఆధారిత ఇయర్ బడ్స్‌ను ఈ ఏడాది విడుదల చేయడం లేదు. దీనికోసం మనం 2027 వరకు వేచి చూడాల్సిందేనని టెక్ విశ్లేషకుడు మార్క్ గుర్మాన్ వెల్లడించారు. యాపిల్ తమ 20వ వార్షికోత్సవ ఐఫోన్, అలాగే రెండవ తరం ఫోల్డబుల్ ఐఫోన్‌లతో పాటు ఈ కొత్త వేలబుల్ డివైస్‌ను ఒకేసారి మార్కెట్‌లోకి తీసుకురావాలని భావిస్తోంది. దీంతో తమ కొత్త AI ఉత్పత్తులను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే అవకాశం లభిస్తుందని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

Advertisement

Also Read: ఐఫోన్ యూజర్లకు ఇక పండగే.. వాట్సప్ చాట్ బ్యాక్‌గ్రౌండ్ లుక్ పూర్తిగా మారిపోనుంది!

ఈ కెమెరాతో ఉపయోగం ఏంటి?

యాపిల్ తీసుకొస్తున్న ఈ ఇయర్ బడ్స్‌లో ఉండే కెమెరాలు సాధారణంగా మనం ఫొటోలు తీసేందుకు ఉపయోగపడవు. ఇవి విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌తో పనిచేస్తాయి. మనం దేనినైనా చూస్తున్నప్పుడు.. ఆ ప్రదేశం లేదా వస్తువుకు సంబంధించిన పూర్తి వివరాలను మన ఇయర్ బడ్స్ ద్వారా సిరి వివరిస్తుంది. దీనికోసం తక్కువ రిజల్యూషన్ ఉన్న డేటాను మాత్రమే వాడతారు. దీంతో ప్రైవసీకి కూడా ఎలాంటి భంగం వాటిల్లదు. అలాగే బ్యాటరీ కూడా త్వరగా అయిపోకుండా ఉంటుంది.

అల్ట్రా కాదు.. ప్రో సిరీస్‌లోనే?

Advertisement

ఈ కెమెరా ఎయిర్‌పాడ్స్ ఎంతో ప్రత్యేకమైనవి కాబట్టి.. యాపిల్ వీటిని AirPods Ultra పేరుతో తీసుకోస్తుందని మొదట్లో అందరూ అనుకున్నారు. కానీ తాజా నివేదికల ప్రకారం.. వీటిని AirPods Pro వేరియంట్లలోనే విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. మాకోస్ Tahoe వెర్షన్‌లో లభించిన సమాచారం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

మొత్తానికి లాంచ్ కాస్త ఆలస్యమైనప్పటికీ.. సిరి పనితీరును మరింత మెరుగుపరచడానికి, హార్డ్‌వేర్‌ను పర్ఫెక్ట్‌గా డిజైన్ చేయడానికి యాపిల్‌కు మంచి సమయం దొరికినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: 7050mAh బ్యాటరీతో రచ్చలేపుతున్న iQOO Z11.. లాంచ్ ఆఫర్‌తో ఎంత తక్కువకు వస్తుందంటే?

Related News

యాపిల్, శాంసంగ్‌లకు చెక్ పెట్టబోతున్న OpenAI.. త్వరలోనే యాప్స్ లేని కొత్త స్మార్ట్‌ఫోన్!

జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. రూ.450 రీఛార్జ్‌తో ఫ్రీ జియో హాట్‌స్టార్, ఏడాది పాటు కాన్వా ప్రో లైట్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 గంటల నాన్‌స్టాప్ మ్యూజిక్..రూ.999కే ఇయర్‌బడ్స్!

రూ.759కే 80 గంటల ప్లేటైమ్, ఓపెన్ ఇయర్ క్లిప్ డిజైన్ ఇయర్ బడ్స్

వాట్సప్‌లో జస్ట్ Hi అని మెసేజ్ చేస్తే చాలు.. మీ PF బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలు ఇట్టే తెలుసుకోవచ్చు!

కొత్త స్మార్ట్ వాచ్ కొనాలనుకుంటున్నారా ?దీనిపై ఓ లుక్కేయండి

మారుమూల గ్రామాలకూ హై-స్పీడ్ ఇంటర్నెట్.. సామాన్యుల జీవితాలను మార్చబోతున్న శాటిలైట్ నెట్‌వర్క్ విశేషాలివే!

ప్రీమియం డిజైన్, పవర్‌ఫుల్ ప్రాసెసర్.. కానీ ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×