E-Paper
Advertisement

India VS South Africa : తొలి సెమీస్.. టార్గెట్ 245.. కష్టాల్లో యువ భారత్..

India VS South Africa : తొలి సెమీస్.. టార్గెట్ 245..  కష్టాల్లో యువ భారత్..
Advertisement
U-19 World Cup IND vs SA

U-19 World Cup IND vs SA Semi-Final Updates : అండర్ -19 వరల్డ్ కప్ తొలి సెమీస్ ఫైనల్ భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతోంది. టాస్ గెలిచిన యువ టీమిండియా.. సఫారీ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఆదిలోనే సౌతాఫ్రికా జట్టు ఓపెనర్ స్టీవ్ స్టాక్ (14) వికెట్ ను కోల్పోయింది. ఆ జట్టు స్కోర్ 23 పరుగుల వద్ద స్టాక్ .. లింబాని బౌలంగ్ లో కీపర్ ఆరవెల్లి అవినాష్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కాసేపటికే డేవిడ్ టీగెర్ (0) ను లింబానీ బౌల్డ్ చేశాడు.

లింబానీ దూకుడుతో సఫారీ జట్టు 46 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. మరో ఓపెనర్ లూన్ డ్రి ప్రిటోరియస్ నినాదనంగా ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 30.2 ఓవర్ వద్ద జట్టు సఫారీ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. 76 పరుగులు చేసిన ప్రిటోరియస్ ముషీర్ ఖాన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అప్పటికి ఆ జట్టు స్కోర్ 118.

Advertisement

రిచర్డ్ సెలెట్ స్వేన్, ఒలివర్ వైట్ హెడ్ నిలకడగా ఆడుతూ జట్టు స్కోర్ ను 150 పరుగులు దాటించారు. అయితే ఓలివర్ (22) ను ముషీర్ ఖాన్ అవుట్ చేయడంతో 40 ఓవర్ చివరి బంతికి నాలుగో వికెట్ కోల్పోయింది సఫారీ జట్టు. అప్పటికి ఆ జట్టు స్కోర్ 163/4. డెవాన్ మెరయిస్ (3) ను సౌమీ పాండే పెవిలియన్ కు పంపడంతో సౌతాఫ్రికా జట్టు 174 పరుగుల వద్ద 5 వికెట్ కోల్పోయింది.

మరోవైపు రిచర్డ్ హాఫ్ సెంచరీ (64)తో పోరాటం చేశాడు. కెప్టెన్ జాన్ జేమ్స్ (24) , ట్రిస్టన్ లూస్ ( (23) దాటి ఆడి జట్టు స్కోరును పెంచారు. నిర్ణీత 50 ఓవర్లలో దక్షిణాఫ్రికా జట్టు 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. భారత్ కు 245 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

Advertisement

లక్ష్య ఛేదనలో టీమిండియా యువ బ్యాటర్ల తడబడ్డారు. 32 పరుగలకే నాలుగు వికెట్లు పడ్డాయి. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (0), అర్షిన్ కులకర్ణి (12), ముషీర్ ఖాన్ (4), ప్రియాన్షు మోలియా (5) వెంటవెంటనే అవుట్ అయ్యారు.

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×