E-Paper
Advertisement

Chandrababu : రాష్ట్రానికి జగన్‌ అక్కర్లేదు.. అన్ని సర్వేల్లో తేలింది ఇదే..

Chandrababu : గాడితప్పిన రాష్ట్రాన్ని దారిలో పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, మాజీ మంత్రి దాడి వీరభద్రరావుతో పాటు వివిధ జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. చంద్రబాబు వారిని సాదరంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Chandrababu : రాష్ట్రానికి జగన్‌ అక్కర్లేదు.. అన్ని సర్వేల్లో తేలింది ఇదే..
Advertisement

Chandrababu : గాడితప్పిన రాష్ట్రాన్ని దారిలో పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, మాజీ మంత్రి దాడి వీరభద్రరావుతో పాటు వివిధ జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. చంద్రబాబు వారిని సాదరంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానని..ఇంత దారుణమైన సీఎంను, పాలనను మాత్రం ఎప్పుడూ చూడలేదని జగన్ పై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఈ ప్రభుత్వం రూ.12 లక్షల కోట్లు అప్పులు చేసిందని.. అభివృద్ధి మాత్రం పూర్తిగా కుంటుపడిందన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని మండిపడ్డారు.

Advertisement

పాఠశాలల భవనాలకు రంగులు వేయడమే అభివృద్ధి కాదు, అందులో చదువుకున్న విద్యార్థులకు మంచి ఉద్యోగాలు వస్తే.. అదే నిజమైన విద్యాభివృద్ధి అని చంద్రబాబు అన్నారు. టీడీపీ హయాంలో 100 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. వాటన్నింటినీ వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని దుయ్యబట్టారు. టీడీపీ హాయంలో విదేశీ విద్య కోసం ఒక్కొక్కరికి రూ.15లక్షలు ఆర్థిక సాయం చేసిన ఘనత తమకే దక్కిందన్నారు.

ఎమ్మెల్యేలను బదిలీ చేయడం తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ నాయకులను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. అందుకే ఎమ్మెల్యేలు, మంత్రులను ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారన్నారు. ఐదేళ్లుగా ఎమ్మెల్యేలు తప్పులు చేస్తుంటే మీరు, మీ ఇంటెలిజెన్స్‌ ఏం చేసిందని బాబు ప్రశ్నించారు. ఎవరికి కావాల్సింది వారు దోచుకుతిన్నారన్నారు. ఇప్పుడేమో సర్వేల పేరుతో నాటకాలాడుతున్నారని బాబు విమర్శించారు. రాష్ట్రానికి జగన్‌ అక్కర్లేదని సర్వేలు చెబుతున్నాయన్నారు. ఇసుక, మద్యం దందాలతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారన్నారు. ప్రజా వ్యతిరేకత రాగానే ఎమ్మెల్యేలను మారుస్తున్నారన్నారు.

Advertisement

జగన్‌.. రాజధాని మార్చలేరని, కనీసం విశాఖపట్నం కూడా వెళ్ల లేరని చంద్రబాబు ఆరోపించారు. ఏప్రిల్‌ తర్వాత టీడీపీ ప్రభుత్వమే వస్తుందని బాబు జోస్యం చెప్పారు. జగన్ మంచికి.. చెడుకీ తేడా తెలియని వ్యక్తి అన్నారు. టీడీపీ-జనసేన అధికారం కోసం ప్రయత్నించడం లేదన్నారు. 5 కోట్ల మంది ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. జగన్‌ రాజకీయాల్లో లేకపోతే రాష్ట్రంలో ఇంత విధ్వంసం జరిగేది కాదన్నారు. జగన్ పార్టీనే కాకుండా రాష్ట్రాన్ని కూడా గందరగోళంలోకి నెట్టారని జగన్ పై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు.

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×