BigTV English

AUS vs PAK : పాక్ బౌలర్ బ్యాట్‌తో విధ్వంసం.. కమిన్స్‌కు ఐదు వికెట్లు..

AUS vs PAK :  పాక్ బౌలర్ బ్యాట్‌తో విధ్వంసం.. కమిన్స్‌కు ఐదు వికెట్లు..

AUS vs PAK : పాకిస్తాన్ 28 ఏళ్ల కల.. ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాలో గెలవాలి. ఆ కోరిక నేటికి తీరడం లేదు. ఇప్పటికే మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో మొదటి రెండింట్లో ఓటమి పాలైంది. ఇప్పుడు మూడోది జరుగుతోంది. ఇక్కడ కూడా తొలి ఇన్నింగ్స్ లో స్కోరు ప్రారంభం కాకుండానే తొలి వికెట్ ను పాక్ కోల్పోయింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ డక్ అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ సయీమ్ అయూబ్ కూడా పరుగులేమీ చేయకుండానే డక్ అవుట్ అయ్యాడు. 4 పరుగులకే రెండు వికెట్లు పడిపోయాయి. ఓపెనర్లు ఇద్దరూ సున్నాలకే అవుట్ అయ్యేసరికి పాకిస్తాన్ పై తీవ్ర ఒత్తిడి పడింది.


తర్వాత సౌద్ షకీల్ (5) అయిపోయాడు. తర్వాత మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ వచ్చాడు. తను మ్యాచ్ నిలబెడతాడనుకుంటే 26 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. ఇటీవల ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న బాబర్, ఎప్పటికి ఫామ్ అందుకుంటాడో తెలీడం లేదు. దీంతో పాకిస్తాన్ ఆందోళనగా ఉంది. మొత్తానికి 47 పరుగులకి 4 వికెట్లు కోల్పోయిన దశలో వచ్చిన రిజ్వాన్ (88) ఎటాకింగ్ ప్లే ఆడాడు. అది క్లిక్ అయ్యింది. సెంచరీ దిశగా సాగే సమయంలో కెప్టెన్ కమిన్స్ అవుట్ చేశాడు.

రిజ్వాన్ ఔటైన సమయానికి పాక్ స్కోరు 190/6గా ఉంది. అయితే ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు పడ్డాయి. అప్పుడు పాక్ స్కోర్ 227/9 గా ఉంది. ఈ సమయంలో వచ్చాడండి ఆఖరి బ్యాటర్ అమీర్ జమాల్. చేతిలో ఒకే ఒక వికెట్ ఉంది. ఎవరు అవుట్ అయినా, మ్యాచ్ అయిపోతుంది. కానీ తనెవరినీ లెక్క చేయలేదు. అద్భుతంగా ఆడాడు. నాలుగు సిక్స్ లు కొట్టాడు. 9 ఫోర్లు కొట్టాడు. ఒక సిక్స్ అయితే రివర్స్ స్వీప్ లో కొట్టిన తీరు మ్యాక్స్ వెల్ ని తలపించిందని నెటిజన్లు కొనియాడుతున్నారు. 92 బాల్స్ లో 82 పరుగులు చేశాడు.


మొత్తానికి గౌరవప్రదమైన స్కోరు 313 చేసి ఆలౌట్ అయ్యింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 5, స్టార్క్ 2, హేజల్‌వుడ్, మార్ష్, లయన్ తలో వికెట్ తీసుకున్నారు.

తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఒకే ఒక ఓవర్ ఆడి ఆరు పరుగులు చేసింది. ఈ టెస్ట్ మ్యాచ్ తో రిటైర్మెంట్ తీసుకుంటున్న డేవిడ్ వార్నర్ రెండోరోజు తొలి ఇన్నింగ్స్ లో మరి సెంచరీగానీ చేస్తాడేమో చూడాల్సిందే. అలాగే పాకిస్తాన్ కోరిక తీరుతుందేమో కూడా చూడాలి.

Related News

Mohamed Siraj : సేమ్ టు సేమ్ డిట్టు దించేశారు… మహమ్మద్ సిరాజ్ కూడా కుళ్ళుకోవాల్సిందే

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక క్రికెట్ కు గుడ్ బై ?

Big Stories

×