BigTV English

Hyderabad : సోషల్ మీడియాలో పరిచయం.. న్యూడ్ వీడియోల కోసం బెదిరింపులు..

Hyderabad: హైదరాబాద్ లో యువతులను ట్రాప్ చేస్తున్న జిష్ణు కీర్తన్‌ ను సైబర్‌బాద్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్ స్టాగ్రామ్‌లో తనను తాను అమ్మాయిగా పరియం చేసుకునేవాడు. ఇతర యువతులకు రిక్వెస్ట్ పెట్టేవాడు . దీంతో ఇతర అమ్మాయిలు కూడా అమ్మాయే అనుకొని మెసేజ్ చేసేవారు . తాను కూడా ఇతరులకు సందేహం రాకుండా అమ్మాయిగానే యువతులకు మెసేజ్ చేసేవాడు. ఇతరులకు ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకునేవాడు.

Hyderabad : సోషల్ మీడియాలో పరిచయం.. న్యూడ్ వీడియోల కోసం బెదిరింపులు..

Hyderabad : హైదరాబాద్ లో యువతులను ట్రాప్ చేస్తున్న జిష్ణు కీర్తన్‌ అనే వ్యక్తిని సైబర్‌బాద్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తనను తాను అమ్మాయిగా పరియం చేసుకునేవాడు. తర్వాత యువతులకు రిక్వెస్ట్ పంపించేవాడు . దీంతో ఇతర అమ్మాయిలు కూడా జిష్ణుకీర్తన్ ను అమ్మాయి అనుకొని మెసేజ్ చేసేవారు . తాను కూడా ఇతరులకు సందేహం రాకుండా అమ్మాయిగానే యువతులకు మెసేజ్ చేసేవాడు. ఇతరులకు ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకునేవాడు.


పరిచయం బాగా పెరిగిన తర్వాత యువతుల ప్రైవేటు ఫోటోలను అడిగేవాడు. దీంతో మెసేజ్ చేసేది అమ్మాయే అనుకుని అమ్మాయిలు వారి యొక్క న్యూడ్ ఫోటోలను పంపేవారు. కొన్ని రోజులుు తర్వాత ప్రైవేటు ఫోటోలను అడ్డం పెట్టుకుని బెదిరించేవాడు. అడిగిన డబ్బులు ఇవ్వమని బెదిరించేవాడు. మరిన్ని న్యూడ్ వీడియోలు చిత్రీకరించి పంపించాలని బెదిరింపులకు పాల్పడేవాడు. న్యూడ్ వీడియోలు తనకు పంపకపోతే అంతకు ముందు ఉన్న ఫోటోలను సోషల్ మీడియా లో పెడతానని బెదిరించేవాడు. ఒకవేళ న్యూడ్ వీడియోలు పంపడం మానేస్తే తన దగ్గర ఉన్న న్యూడ్ ఫోటోలను, వీడియోలను వారి ఫాలోవర్స్ కి పంపుతానని బెదిరింపులకు పాల్పడేవాడు. బెదిరింపులు ఎక్కువుగా ఉండటంతో బాధితుల్లో ఒకరు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు .

దీంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడైన జిష్ణు కీర్తన్‌ను సైబరాబాద్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు సోషల్ మీడియా పట్ల ఎన్ని హెచ్చరికలు చేసినా నేటి యువతరం పట్టించుకొవడం లేదు. తీరా మోసపోయామని గ్రహించిన తర్వాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సోషల్ మీడియా పట్ల తగిన జాగ్రత్తలు తీసుకొవాలని పోలీసులు సూచించారు . లేకపోతే యువత జీవితాలు అర్ధాంతరంగా నాశనం అవుతాయని హెచ్చరించారు.


Tags

Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×