BigTV English

Chandragiri Dsp action by DGP: చంద్రగిరి డీఎస్పీపై వేటు, పెట్రోల్ బాంబులు కలకలం

Chandragiri Dsp action by DGP: చంద్రగిరి డీఎస్పీపై వేటు, పెట్రోల్ బాంబులు కలకలం

Chandragiri Dsp action by DGP: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందే కాదు, తర్వాత కూడా పోలీసుల పై వేటు కంటిన్యూ అవుతోంది. ఎన్నికల్లో ఖాకీల వ్యవహార శైలిపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఇంటాబయటా బయట విమర్శలు వెల్లువెత్తడంతో ఉన్నతాధికారులు ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.


తాజాగా చంద్రగిరి డీఎస్పీ యశ్వంత్ రాజ్‌కుమార్‌పై వేటు పడింది. డీజీపీ కార్యాలయానికి ఆయనను సరెండర్ చేస్తూ ఉత్వర్వులు జారీ అయ్యాయి. చంద్రగిరిలో ఎన్నికల వేళ జరిగిన ఘటనలను నిలువరించడంతో విఫలమైనందుకు వేటు వేసినట్టు తెలుస్తోంది. అధికార-విపక్షాల కార్యకర్తలు దాడులు, విధ్వంసాలకు తెగబడుతున్నా వాటికి కంట్రోల్ చేయకపోవడంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది.

ఎన్నికలకు మూడు నెలల కిందట యశ్వంత్‌ను చంద్రగిరి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. గతంలో వైసీపీ-టీడీపీ కార్యకర్తల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. అయినా యశ్వంత్ పట్టించుకోలేదు. ఎన్నికల రోజు ఘర్షణలను నివారించడంలో పోలీసు అధికారి విఫలమయ్యారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తర్వాతైనా టీడీపీ అభ్యర్థి పులవర్తి నానికి భద్రత కల్పించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చేలోపు ఇంకెంతమంది అధికారులపై వేటు పడుతుందో చూడాలి.


ALSO READ: వైసీపీ నేతల తీరు సిగ్గుచేటు: అశోక్ బాబు

ఇదిలావుండగా ఎన్నికల ఫలితాల వేళ పల్నాడు హింస జరిగే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు సోదాలు తీవ్రతరం చేశారు. బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామంలో పెట్రోల్ బాంబులు కలకలం రేపాయి. గడ్డివాములో దాచి ఉంచిన నాలుగు పెట్రోల్ బంబులను స్వాధీనం చేసుకున్నారు స్థానిక పోలీసులు. దీంతో పోలీసులు అక్కడ ఇరుపార్టీల కార్యకర్తలపై ఓ నిఘా వేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల రోజు ఎలాంటి ఘటనలు జరగడానికి వీల్లేదని ఆ జిల్లా ఎస్పీ, దిగువస్థాయి అధికారులకు సీరియస్‌గా చెప్పినట్టు సమాచారం.

 

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×