BigTV English

Chennai: తమిళనాడులో ఘోర ప్రమాదం, ఐదుగురు స్టూడెంట్స్ మృతి, వారంతా ఏపీకి చెందినవారిగా..

Chennai:  తమిళనాడులో ఘోర ప్రమాదం, ఐదుగురు స్టూడెంట్స్ మృతి, వారంతా ఏపీకి చెందినవారిగా..

Chennai: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థు లు స్పాట్ లో మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులంతా ఏపీకి చెందినవారు.


అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడుగురు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సెలవు రావడంతో కారులో తమిళనాడు వెళ్లారు. శనివారం కారులో వీరంతా తిరువణ్ణామలై వెళ్లి అరుణాచలం స్వామిని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత తిరిగి ఆదివారం రాత్రి కాలేజీకి బయలుదేశారు.

తిరువళ్లూరు జిల్లా కనకమ్మ సత్రం సమీపంలోకి కారు రాగానే వేగంగా వచ్చిన కంటెయినర్ ట్రక్కు వీరిని ఢీ కొట్టింది. లారీ వేగానికి కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ఐదుగురు స్టూడెంట్స్ స్పాట్‌లో మృతి చెందా రు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


ALSO READ: అలర్ట్.. తిరుమలలో మూడు రోజులు ఆర్జిత సేవలు రద్దు

మృతులంతా ఏపీలోని వివిధ జిల్లాలకు చెందినవారు. ప్రొద్దుటూరుకి చెందిన నితీష్, తిరుపతికి చెందిన యుగేశ్, చేతన్, కర్నూలుకు చెందిన రామ్మోహన్, విజయవాడకు చెందిన బన్ను సతీష్‌లు ఉన్నారు. వీరంతా చెన్నై సమీపంలోని ఎస్ఆర్ఎం కాలేజీలో ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు.

విష్ణు, చైతన్యలకు గాయాలయ్యారు. ప్రస్తుతం వారిద్దరూ తిరువళ్లూరులోని ప్రభుత్వం ఆసుపత్రిలో కోలు కుంటున్నారు. కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను అతి కష్టం మీద బయటకు తీశారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

 

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×