Amaravati: ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై నోరు విప్పారు సీఎం చంద్రబాబు. ప్రజల్లో ఆ పార్టీ గ్రాఫ్ పడిపోతుందని, అందుకు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు నిదర్శనమన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి 39.81 శాతం ఓట్లు రాగా, స్థానిక ఎన్నికల్లో 33. 56 శాతం ఓట్లు వచ్చాయన్నారు. అదే సమయంలో కూటమికి వచ్చిన ఓట్ల శాతాన్ని బయట పెట్టారు. 2024 ఎన్నికల్లో కూటమికి 55. 3 శాతం రాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో 58.9 శాతం వచ్చిందన్నారు. గడిచిన రెండేళ్లలో వైసీపీ ఓట్ల శాతం 6.2 శాతం తగ్గిందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించిందన్నారు సీఎం చంద్రబాబు. సోమవారం ఉదయం మీడియా ముందుకొచ్చిన ఆయన, కీలక వ్యాఖ్యలు చేశారు. మామూలు ఓట్ల కంటే, ఉద్యోగులు ఎక్కువగా ఓట్లు వేశారన్నారు. 2024 ఎన్నికల కంటే కూటమికి ప్రజాదరణ పెరిగిందన్నారు. అందుకు ఓట్ల శాతం నిదర్శనమన్నారు. ప్రజలు బ్యాలెట్‌తో ఇచ్చిన తీర్పు అని తేల్చేశారు. గొడవల్లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయన్నారు. ప్రజలు స్వచ్ఛంధంగా ముందుకొచ్చి ఓటు వేశారన్నారు.
అంతకుముందు ఈవీఎంలను మ్యానిప్లేట్ చేశారని మాట్లాడారని వివరించారు. రెండేన్నరేళ్ల పాలనకు ప్రజాస్పందనకు ఇదో ఉదాహరణగా చెప్పారు. కూటమి విజయానికి కారణమైన రాష్ట్ర ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తు్న్నట్లు తెలిపారు. వైసీపీ జెడ్పీటీసీలు ఖాతా ఓపెన్ చేయని జిల్లాలు ఏడు ఉన్నాయన్నారు. అందులో అనకాపల్లి, విశాఖ, కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, మార్కాపురం, పల్నాడు జిల్లాలు ఉన్నాయన్నారు.
ALSO READ: జగన్‌కు మళ్లీ కొత్త టెన్షన్.. ముందు నుయ్యి వెనుక గొయ్యి, మళ్లీ ఏం జరిగింది?