Sunil Reddy:సునీల్ రెడ్డి..తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సక్సెస్ ఫుల్ ఫిలిమ్స్ తీసిన కోదండరామిరెడ్డి కొడుకని చాల తక్కువ మందికి తెలుసు.అయితే ఈయన తమ్ముడు వైభవ్ గొడవ వంటి సినిమాల్లో నటించి మనకు ముందుగానే పరిచయం.అయితే ప్రస్తుతం వైభవ్ స్పీడ్ తగ్గించగా అన్న సునీల్ రెడ్డి మాత్రం స్టార్ సినిమాలలో కనిపిస్తూ జోరు చూపిస్తున్నాడు. ఇక ఫుల్ బిజీ అయిపోయిన సునీల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన సంఘటలని ఇలా చెప్పుకొచ్చాడు.
ముఖ్యంగా తమిళ స్టార్ హీరో విజయ్, సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల్లో నటించిన అనుభవాలను గుర్తు చేసుకున్న సునీల్ నటుడు ,కమెడియన్ వీటీవీ గణేష్‌కు సంబంధించిన ”ఇంత టాలెంట్‌గా ఉన్నావేంట్రా నువ్వు.. ఎవర్రా నువ్వు” అనే ఫేమస్ డైలాగ్‌ను తనదైన శైలిలో చెప్పి నవ్వులు పూయించాడు.
విజయ్‌తో 60 రోజులకు పైగా షూటింగ్..
ఇక దళపతి విజయ్‌తో తనకున్న పరిచయం గురించి సునీల్ రెడ్డి మాట్లాడుతూ విజయ్‌తో మొదటిసారి ‘మాస్టర్’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించానని, ఆ తర్వాత ‘బీస్ట్’ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని తెలిపాడు.
‘బీస్ట్’ సినిమా షూటింగ్ లో మొదట్లో విజయ్‌తో మాట్లాడాలంటే కాస్త భయంగా ఉండేదని సినిమాలో ఓ షీల్డ్ ఫైట్ సీక్వెన్స్ సమయంలో ఫైటర్స్‌తో పాటు తాను, విజయ్ మాత్రమే అక్కడ ఉండేవాళ్లమని చెప్పుకొచ్చాడు. విజయ్ దగ్గరకు వెళ్లి మాట్లాడాలా? వద్దా? అనే చిన్న డైలమాలో ఉండేవాడినని , ఆ తర్వాత నెమ్మదిగా పరిచయం పెరిగిందని బీస్ట్ రోజుల్ని గుర్తుచేసుకున్నాడు.
ఇక విజయ్‌తో కలిసి దాదాపుగా 55 నుంచి 65 రోజులు షూటింగ్లో పాల్గొన్నానని ఆ సమయంలో ఆయనతో మంచి అనుబంధం ఏర్పడిందని తెలిపారు. అయితే ఆ తర్వాత కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే కలుసుకున్నానని, ప్రస్తుతం విజయ్ రాజకీయాల్లోకి వెళ్లి సీయం అవడం మూలానా డైరెక్ట్ గా కలిసే అవకాశం ఉండదేమో అంటూ తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు.
తమన్నాతో కలిసి నటించే అవకాశం
ఇక దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో తనకున్న అనుబంధం గురించి మాట్లాడుతూ నెల్సన్ తీసిన ‘బీస్ట్’ లో నటించిన తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘జైలర్’లోనూ అవకాశం దక్కించుకున్నానని చెప్పారు.అయితే బీస్ట్ ఆడియో ఫంక్షన్ సమయంలో రజనీకాంత్ గారు తమన్నా సినిమాలో నటిస్తున్నారని చెప్పడంతో, ఆమెతో కలిసి నటించే అవకాశం వస్తుందని అనుకున్నానని . అయితే దర్శకుడు నెల్సన్ తనకు అవకాశం ఇచ్చారని నవ్వుతూ చెప్పుకొచ్చాడు.
నెల్సన్‌తో మంచి అనుబంధం
అయితే ఈ సినిమాలో రమ్యకృష్ణతో తనకు జోడీగా నటించే అవకాశం వస్తే , మరోవైపు మరో సునీల్‌కు తమన్నాతో నటించే ఛాన్స్ దక్కిందని కామెడీగా చెప్పుకొచ్చాడు.సెట్స్‌లో తెలుగు తెలిసిన నటీనటులు ఉండటంతో షూటింగ్ మొత్తం సరదాగా సాగేదని, తమన్నా, రజనీకాంత్ లతో కలిసి పనిచేయడం మంచి అనుభవమని తెలిపాడు.
ఇక నెల్సన్ రజనీకాంత్‌తో సినిమా చేస్తున్నాడని తెలిసినప్పుడు ఎంతో ఆనందంగా అనిపించిందని , అప్పటికే నెల్సన్‌తో మంచి అనుబంధం ఉండటంతో తనకూ సినిమాలో అవకాశం వస్తుందేమోనని అనుకున్నానని తెలిపాడు . అయితే ఆ అవకాశం వస్తుందా లేదా అన్నది పక్కన పెడితే, రజనీకాంత్‌ను దగ్గరగా చూసే అవకాశం దొరకడమే తనకు సంతోషమని తన మనసులోని మాటని బయటపెట్టాడు సునీల్ రెడ్డి !
ALSO READ :ఒకే వేదికపై రామ్ చరణ్, నాగార్జున.. ఫ్యాన్స్‌కు పండగే!