BigTV English

Chittoor Politics : చిత్తూరులో కొత్త పంచాయితీ.. విజయానందరెడ్డి వర్సెస్ ఆరణి శ్రీనివాసులు..

Chittoor Politics : చిత్తూరులో కొత్త పంచాయితీ..  విజయానందరెడ్డి వర్సెస్ ఆరణి శ్రీనివాసులు..

Chittoor Politics : చిత్తూరు అసెంబ్లీ ఇన్‌చార్జ్‌గా సిట్టింగ్ ఎమ్మెల్యే అరణీ శ్రీనివాసులు కాదని విజయానంద్ రెడ్డి వైపు మొగ్గు చేప్పింది వైసీపీ అదిష్టానం. అయితే ఇన్‌చార్జ్‌ ప్రకటన మాత్రం వాయిదా వేసింది. సదరు ప్రకటన వాయిదా వేనుక పెద్దాయన హస్తం ఉందా? ఉమ్మడి చిత్తూరు జిల్లా సహా రాయలసీమ వ్యాప్తంగా బలిజ సామాజికవర్గంలో వ్యతిరేకత వస్తుందనా ? లేకపోతే నెక్ట్స్‌ లిస్ట్‌లో పార్టీ అధినేత విజయానంద్ పేరే ప్రకటిస్తారా?



చిత్తూరు శాసనసభా స్థానం ఇన్‌చార్జ్‌గా అర్టీసి వైఎస్ చైర్మన్ ఎం.సివిజయానందరెడ్డి పేరు ఖరారు అయిందనే ప్రచారం వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. రెండు రోజుల క్రితం తాడేపల్లిలో ధనుంజయ రెడ్డి సమక్షంలో జరిగిన పంచాయితీలో విజయానందారెడ్డి వైపు జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపారని అంటున్నారు. ఆ రోజు జరిగిన చిత్తూరు నియోజకవర్గం పంచాయితీకి ఎమ్మెల్యే అరణీ శ్రీనివాసులు, విజయానందరెడ్డి, బుల్లెట్ సురేష్‌లు హాజరయ్యారట. అయితే శ్రీనివాసులతో పాటు సురేష్‌ను సైతం వ్యతిరేకించిన అధిష్టానం. సర్వేలు విజయానందరెడ్డికు అనుకూలంగా ఉన్నాయని చెప్పినట్లు తెలుస్తోంది. సమావేశానికి ముందు ఎమ్మెల్యే శ్రీనివాసులు తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డిని కలసి వెళ్ళినట్లు. పెద్దిరెడ్డి టికెట్ విషయంలో తాను అశక్తుడిని అన్నట్లు సమాచారం.

ఆ క్రమంలో ధనుంజయ రెడ్డి సమక్షంలో జరిగిన పంచాయితీలో తన వాదనను శ్రీనివాసులు వినిపించినట్లు తెలుస్తోంది. అయితే శ్రీనివాసుల మీద వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని. ముఖ్యంగా భూకజ్జాలుతో పాటు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగే చిన్న పాటి వర్కులు సైతం అయనే చేస్తుండటంపై మిగతా క్యాడర్ లో వ్యతిరేకత పెరిగిదంటూ వాటికి సంబంధించిన అధారాలు చూపించారంట. అయితే ఇదే సమయంలో విజయానందరెడ్డి పట్ల అంత సానుకూలత లేదని బుల్లెట్ సురేష్ చెప్పినప్పటికి. ధనుంజయ్ రెడ్డి మాత్రం విజయానంద్ రెడ్డి పట్ల సీఎం అసక్తిగా ఉన్నారని అన్నారంట.


పంచాయితీలో విజయానందరెడ్డికి అవకాశం ఇస్తున్నట్లు చెప్పినప్పటికి తర్వాత రెండో విడత అభ్యర్థుల ప్రకటనలో చిత్తూరు ఇన్‌చార్జ్ పేరు ప్రకటించలేదు. అది వాయిదా వేయడానికి కారణమేమిటని ఇప్పుడు చిత్తూరులో అసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే తమ సామాజిక వర్గానికి వైసిపిలో అన్యాయం జరుగుతుందనే సంకేతాలను బలిజ వర్గానికి చెందిన ఎమ్మెల్యే అరణీ శ్రీనివాసులు విజయవంతంగా ఆ వర్గీయుల్లోకి తీసుకువెళ్లారంట. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గెలుపు ఓటములు ప్రభావితం చేసే స్థాయిలో ఆ సామాజిక వర్గం ఉండటంతో పాటు ఆ సామాజిక వర్గానికి పెద్ద దిక్కు అయిన డికె ప్యామీలి తరుచుగా చిత్తూరులో పర్యటిస్తుంటుంది.

అంతేకాక ఎన్నికలలో పోటీచేస్తామని డికే ఆదికేశవులు కూమారుడు డికె శ్రీనివాస్ ప్రకటించడంతో పాటు వారి సామాజిక వర్గానికి చెందిన అన్ని పార్టీల వారు అయనతో కలవడంతో ఈవిషయంలో అధిష్టానం అచూతూచి వ్యవహారిస్తుందని అంటున్నారు. మొత్తం మీదా ప్రస్తుతానికి వాయిదా వేసిన ఖచ్చితంగా విజయానంద్ రెడ్డే అభ్యర్థిగా ఉంటారని అంటున్నారు. ప్రకటన వాయిదా పడటానికి కారణం జిల్లా పెద్ద దిక్కే కారణమని అంటున్నారు. ఎది ఏమైనా ఎవ్వరు అడ్డం పడినా తమ నాయకుడే అభ్యర్థి అంటోంది విజయానందరెడ్డి వర్గం. మరి జగన్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

.

.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×