BigTV English

Cheddi gang: మళ్లీ చెడ్డీ గ్యాంగ్ అలజడి.. ఇంట్లోకి చొరబడి.. ఆపై

Cheddi gang: మళ్లీ చెడ్డీ గ్యాంగ్ అలజడి.. ఇంట్లోకి చొరబడి.. ఆపై

Cheddi gang: చెడ్డీ గ్యాంగ్.. ఈ పేరు వినిపిస్తే చాలు ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల ప్రజలు భయంతో వణుకుతారు. వీరికి ప్రాంతంతో సంబంధం లేదు. ఆ గ్యాంగ్ కన్నుపడితే ఇక అంతే. ముఖ్యంగా నగరాలకు దూరంగా ఉండే ఇళ్లే వీరి టార్గెట్. దర్జాగా ఇంట్లోకి చొరబడడం, అందినకాడికి దోచుకోవడం.
తాజాగా తిరుపతిలోని తిరుచానూరులో మరోసారి చెడ్డీ గ్యాంగ్ అలజడి మొదలైంది.


తిరుచానూరులో మరోసారి చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ చేసింది. కొత్తపాళెం లేఅవుట్‌లోవున్న ఓ ఇంట్లో చోరీకి పాల్పడింది. ప్రహరీ గోడ దూకి ఆ ఇంట్లోకి ప్రవేశించారు దుండగులు. కిటికీ ఊచలు తొలగించి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. మనుషుల సంచారం పెద్దగా లేకపోవడంతో బీరువాలోని నగలు, నగదు తీసుకెళ్లారు. కేవలం ముగ్గురు సభ్యుల గ్యాంగ్ మాత్రమే వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

చోరీపై బాధిత కుటుంబం ఫ్యామిలీకి ఫిర్యాదు చేసింది. ఇంటి సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారం గా వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖానికి ముసుగు వేయడంతో వాళ్లు ఎవరన్నది పోలిక దొరకలేదు. రెండేళ్ల కిందట చెడ్డీ గ్యాంగ్ తిరుచానూరులో హల్‌చల్ చేసింది. మళ్లీ ఇప్పుడు రంగంలోకి దిగేసింది.


ALSO READ: మాజీ మంత్రి రోజా పై సిఐడీ విచారణకు ఆదేశం

చెడ్డీ గ్యాంగ్ సభ్యులు చోరీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. వారి గురించి ఎలాంటి డీటేల్స్ బయట పడకుండా అడుగులు వేస్తారు. ముఖ్యంగా ముఖానికి ముసుగు ధరిస్తారు. బనియన్, చెడ్డీ వేసు కుంటారు. శరీరానికి నూనె పూసుకుంటారు. దోపిడీ సమయంలో ఎవరైనా పట్టుకున్నా జారిపోవడానికి సులువుగా ఉంటుంది.

 

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×