E-Paper
Advertisement

తక్కువ బడ్జెట్‌లో లగ్జరీ లుక్..ఈ సైడ్-బై-సైడ్ ఫ్రిజ్‌లపై ఓ లుక్కేయండి

తక్కువ బడ్జెట్‌లో లగ్జరీ లుక్..ఈ సైడ్-బై-సైడ్ ఫ్రిజ్‌లపై ఓ లుక్కేయండి
Advertisement

Side by side refrigerator under 1 lakh: ఇంట్లో నిల్వ చేసే కూరగాయలు, పండ్లు, పాల పదార్థాలు , ఇతర ఆహార పదార్థాలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఒక మంచి సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్ చాలా ముఖ్యం. మార్కెట్లో కొన్ని ప్రముఖ బ్రాండ్ల ప్రీమియం ఫ్రిజ్‌ల ధరలు రెండు లక్షల రూపాయల వరకు పలుకుతున్నాయి. అయితే.. సామాన్యులు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని, అచ్చం అలాంటి ప్రీమియం టెక్నాలజీని కేవలం రూ. 1 లక్ష లోపు ధరలోనే అందిస్తున్న టాప్ 5 సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. Samsung 653 L Side by Side Refrigerator:

టెక్ లవర్స్ శాంసంగ్ బ్రాండ్ ఎప్పుడూ మొదటి ఛాయిస్‌గా ఉంటుంది. ఈ మోడల్ 653 లీటర్ల భారీ కెపాసిటీతో.. వస్తుంది. ఇందులో ఉన్న ‘ట్విన్ కూలింగ్ ప్లస్’ టెక్నాలజీ ఫ్రిజ్ లోపల తేమను ఎప్పుడూ సరైన విధంగా ఉంచుతుంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. మీ అవసరానికి తగినట్లుగా ఫ్రిజ్‌ను మార్చుకునే 5-in-1 కన్వర్టిబుల్ మోడ్ ఇందులో ఉంది. వైఫై కనెక్టివిటీ , AI ఎనర్జీ మోడ్ ద్వారా కరెంట్ బిల్లును భారీగా తగ్గించుకోవచ్చు. మార్కెట్లో దీని ధర సుమారు రూ. 79,990 నుండి రూ. 87,400 వరకు ఉంది.

2.LG 650 L Side by Side Refrigerator:

Advertisement

ఎల్జీ బ్రాండ్ అనగానే నమ్మకానికి,క్వాలిటీకి మారుపేరుగా నిలుస్తుంది. ఈ 650 లీటర్ల ఫ్రిజ్ చూడటానికి ఎంతో ఆకర్షణీయమైన ‘డాజిల్ స్టీల్’ ఫినిషింగ్‌తో.. వస్తుంది. ఇందులో.. ఉండే ‘హైజీన్ ఫ్రెష్+’ టెక్నాలజీ బ్యాక్టీరియాను, చెడు వాసనను 99.99% వరకు తొలగిస్తుంది. ‘డోర్ కూలింగ్+’ , ‘మల్టీ ఎయిర్ ఫ్లో’ సిస్టమ్ కారణంగా ప్రతి మూలకు చల్లదనం సమానంగా అందుతుంది. అలాగే స్మార్ట్ డయాగ్నోసిస్ ద్వారా ఫ్రిజ్‌లో వచ్చే చిన్నచిన్న సమస్యలను మీ మొబైల్ ద్వారానే ఈజీగా గుర్తించొచ్చు. దీని ధర సుమారు రూ.84,990 నుంచి రూ.94,100 మధ్య ఉంది.

3. Haier 598 L WiFi Refrigerator:

పెద్ద ఫ్యామిలీల కోసం తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు కోరుకునే.. వారికి హయర్ బ్రాండ్ ఒక అద్భుతమైన ఆప్షన్.ఇది 598 లీటర్ల కెపాసిటీని కలిగి ఉండి, ‘డియో ఫ్రెష్’ టెక్నాలజీతో వస్తుంది. ఇది ఆహారం చెడిపోకుండా ..ఎక్కువ రోజులు సువాసన వెదజల్లేలా చూస్తుంది. ఇందులో ఉన్న జంబో ఐస్ మేకర్ పెద్ద పార్టీలు లేదా వేడుకలకు ఎంతో ఉపయోగ పడుతుంది. స్మార్ట్ వైఫై కంట్రోల్ సాయంతో ఎక్కడి నుంచైనా మొబైల్ యాప్ ద్వారా టెంపరేచర్‌ను కంట్రోల్ చేయెచ్చు. దీని ధర సుమారు రూ.74,990 నుంచి రూ.92,800 వరకు లభిస్తోంది.

4. Godrej 600 L 3Side by Side Refrigerator:

Advertisement

స్వదేశీ టెక్నాలజీతో వస్తున్న.. ఈ గోద్రెజ్ రిఫ్రిజిరేటర్ అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంది.ఇది 600 లీటర్ల భారీ సామర్థ్యాన్ని కలిగి ప్రత్యేకంగా స్మార్ట్ కన్వర్టిబుల్ జోన్స్‌ను కలిగి ఉంది. దీనిలోని అడ్వాన్స్డ్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఎలాంటి సౌండ్ లేకుండా నిశ్శబ్దంగా పని చేస్తుంది. దీనిలోని టఫ్ గ్లాస్ షెల్ఫ్‌లు బరువైన పాత్రలను చాలా సులభంగా మోయగలవు. ఈ మోడల్ ధర మార్కెట్లో సుమారు రూ. 67,990 నుంచి రూ.72,490 వరకు అందుబాటులో ఉంది.

Also Read: ఇంట్లోనే కేఫ్ స్టైల్ కాఫీ..రూ.1,899కే అగారో రాయల్ కాఫీ మేకర్‌

5. Voltas Beko 563 L Side by Side Refrigerator:

టాటా సంస్థకు చెందిన వోల్టాస్ బెకో బ్రాండ్ నమ్మకానికి, లాంగ్ లాస్టింగ్ పర్ఫార్మెన్స్‌కు పెట్టింది పేరు.563 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ ఫ్రిజ్ తక్కువ కరెంట్ ఉపయోగించి అద్భుతమైన కూలింగ్ అందిస్తుంది. ప్రో-స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్ దీని ప్రత్యేకత. దీనిలో ఉన్న ఆటో డిఫ్రాస్ట్ సిస్టమ్ వల్ల ఫ్రిజ్‌లో ఐస్ గడ్డకట్టే సమస్యే రాదు. సాధారణ బడ్జెట్‌లో.. ప్రీమియం లుక్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. దీని ధర సుమారు రూ. 57,490 వరకు ఉంటుంది.

రూ. 2 లక్షలు వెచ్చించి ప్రీమియం ఫ్రిజ్‌లను కొనలేమని నిరాశ చెందే వారికి.. ఈ ఐదు ఆప్షన్లు గొప్ప ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. ఆధునిక టెక్నాలజీ, ఎక్కువ స్టోరేజ్ స్పేస్, అందమైన లుక్ ఇవన్నీ ఇప్పుడు.. రూ.1 లక్ష లోపే లభిస్తుండటం నిజంగా టెక్ లవర్స్‌కు గుడ్ న్యూసే.

Related News

ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? అయితే ఈ మోసాలపై బీ అలర్ట్.. తెలంగాణ సైబర్ బ్యూరో వార్నింగ్!

పండుగలను మనం కోల్పోయామా..? పండుగలే మనల్ని వదిలేసి వెళ్లిపోయాయా..?

జియో రూ. 1,748 vs రూ. 1,799 ప్లాన్లు.. బెనిఫిట్స్ పరంగా దేని దమ్ము ఎంత? ఏది రీఛార్జ్ చేస్తే బెటర్?

పెళ్లికాని ప్రసాదులకు ఏఐ హెచ్చరిక.. ఫోటో చూసి ఫ్లాట్ అయ్యారో.. ఖాతా ఖాళీ అవ్వడం ఖాయం!

iPhone 20 Proలో ఊహించని మార్పు.. డైనమిక్ ఐలాండ్ విషయంలో యాపిల్ ప్లాన్ ఇదేనా?

వీఐ రూ.398 ప్లాన్.. కాలింగ్, 5G డేటాతో పాటు.. 19 ఓటీటీలు ఉచితం!

ఇంట్లోనే కేఫ్ స్టైల్ కాఫీ..రూ.1,899కే అగారో రాయల్ కాఫీ మేకర్‌

Big Stories

Advertisement
×