Amaravati: స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ వైపు నుంచి పోస్టుమార్టం మొదలైంది. ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, కొంతమంది నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని సూటిగా హెచ్చరించినట్టు తెలుస్తోంది.
చంద్రబాబు కేబినెట్ నుంచి పలువురు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నిక ఫలితాల్లో జిల్లా నేతలు, ఇన్‌ఛార్జ్ మంత్రుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం, అల్లూరు సీతారామరాజు, తిరుపతి జిల్లాల్లో జెడ్సీటీసీ, ఎంపీటీసీ సీట్లు వైసీపీకి ఎక్కువగా రావడం అధికార పార్టీకి మింగుడు పడడం లేదు. అనంతపురం కార్పొరేషన్ అల్లూరు సీతారామరాజు పీఠాలు దక్కకపోవడంపై టీడీపీ హైకమాండ్ కాస్త గరంగరంగా ఉంది.
మంగళవారం కేబినెట్ సమావేశం తర్వాత పార్టీకి చెందిన మంత్రులతో నారా లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బ్రేక్‌ఫాస్ట్ పేరుతో స్థానిక ఎన్నికల ఫలితాలపై సమీక్షించారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ నేతల నిర్లక్ష్యంపై కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారట చినబాబు. కొన్నిచోట్ల నాయకుల నిర్లక్ష్యం వల్ల ఓటమి పాలయ్యామని, దీనికి ఆ జిల్లాల నేతలు, ఇన్‌ఛార్జ్ మంత్రులు కారణమని అన్నట్లు సమాచారం.