E-Paper
Advertisement

AP Assembly Session-2026: పోస్ట్ మార్టానికి కారణమైన వాళ్లక్కడికే.. 90 రోజుల్లో సోషల్ మీడియా బ్యాన్-సీఎం చంద్రబాబు

AP Assembly Session-2026: పోస్ట్ మార్టానికి కారణమైన వాళ్లక్కడికే.. 90 రోజుల్లో సోషల్ మీడియా బ్యాన్-సీఎం చంద్రబాబు
Advertisement

AP Assembly Session-2026: ఏపీలో కూటమి ప్రభుత్వం కొనసాగితేనే రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. ఈ విషయాన్ని చాలా సార్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారని గుర్తు చేశారు. ఇవాళ గుజరాత్ లో రెండున్నర దశాబ్దాలుగా ఒక ప్రభుత్వం ఉండడం వల్ల అభివృద్ధి జరిగిందన్నారు. కేంద్రంలో నాలుగోసారి ఎన్డీయే అధికారంలోకి వస్తుందని, ప్రధానిగా నరేంద్రమోదీ ఉంటారని క్లారిటీ ఇచ్చారు.

కూటమి ప్రభుత్వం కొనసాగితేనే రాష్ట్రానికి భవిష్యత్-సీఎం చంద్రబాబు

Advertisement

ఇక్కడ కూడా ఒక అజెండా ఉందని, ఎన్డీయే గెలవాలన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని తాను- పవన్ కళ్యాణ్ ఆలోచించామన్నారు. వ్యతిరేక ఓటు చీలడానికి వీల్లేదని మొదట సంఘీభావం తెలిపిన వ్యక్తి పవన్ అని గుర్తు చేశారు. ఈ విషయంలో బీజేపీ కూడా సహకరించడంతో కూటమిగా ఏర్పడ్డామన్నారు. మొదటిసారి 94 శాతం మంది అభ్యర్థుల గెలుపు సాధ్యమైందంటే తాను, పవన్‌, ప్రధాని మోదీపై ఉన్న నమ్మకమేనని అన్నారు.

శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. అదే సమయంలో మాజీ సీఎం జగన్‌పై ఘాటు విమర్శలు చేశారు. ఆయన ప్రొద్దుటూరు పర్యటనలో రప్పా రప్పా వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. చావుకైనా పెళ్లికైనా ఒకటే మంత్రమన్నారు. ఆయనకు సెక్యూరిటీ ఇవ్వలేదని అంటున్నారని, చివరకు ఏఎస్ఐని వీల్ చైర్‌లో తీసుకొచ్చారన్నారు.

Advertisement

90 రోజుల్లో సోషల్ మీడియాపై బ్యాన్

ఇది ఊహించగలమా? అని ప్రశ్నించారు. రాజకీయ నాయకుడు గంజాయి, డ్రగ్స్, బ్లేడ్ బ్యాచ్ గురించి మాట్లాడరని అన్నారు. పొట్టేళ్లతో కటౌట్లకు రక్తాభిషేకం చేయడం ఏంటని, డైరెక్ట్‌గా హింసను ప్రొత్సహించడమే అవుతుందన్నారు. పోస్ట్ మార్టానికి కారణమైన వాళ్లు.. కచ్చితంగా పోస్ట్ మార్టానికి వెళ్తారన్నారు.

ఏపీలో సోషల్ మీడియాపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. 16 లేదా 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం తేస్తామన్నారు. 90 రోజుల్లో విధి విధానాలు ప్రకటిస్తామని అసెంబ్లీ వేదికగా చెప్పారు. సోషల్ మీడియా వల్ల పిల్లలు నష్టపోవడానికి వీల్లేదన్నారు. దానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అసెంబ్లీ వేదికగా హామీ ఇస్తున్నానని, గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. క్వాలిటీలో ఏ మాత్రం రాజీ లేదన్నారు సీఎం చంద్రబాబు.

ALSO READ:  బీఅలర్ట్.. పవన్ చెప్పింది అక్షరాల నిజం!

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×