CM Chandrababu: సీఎం చంద్రబాబు ఓ విషయంలో క్లారిటీ ఇచ్చేశారా? మోదీ కేబినెట్‌లోకి వెళ్లే ఉద్దేశం లేదని ఎందుకు చెప్పారు? అసలు ఆయనపై జరుగుతున్న ప్రచారమేంటి? అందులో వాస్తలేంటి? దావోస్‌లో అదే మాట ఎందుకు రిపీట్ అయ్యింది? ఇవే ప్రశ్నలు ఆ పార్టీ నేతలను వెంటాడుతున్నాయి.
రెండు వారాలుగా ఏపీ రాజకీయాల్లో విచిత్రమైన ప్రచారం సాగుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు, కొద్దిరోజుల్లో మోదీ కేబినెట్‌లోకి వెళ్తారనేది దాని సారాంశం. ఈ విషయం తెలియగానే కొందరు సీనియర్ నేతలు షాకయ్యారు. ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయం తీసుకోవడమేంటి? గతంలో అలాంటి అవకాశాలు ఎన్నో వచ్చాయని, అవన్నీ ఆయన వదులుకున్నారని అన్నారు.
సడన్‌గా ఈ నిర్ణయం ఏంటని వెనుక ఏదో జరుగుతోందన్న చర్చ బలంగా సాగింది. చివరకు ఓ తెలుగు ఛానెల్‌లో సీపీఎం నేత గపూర్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి వ్యవహారంపై చర్చ నేపథ్యంలో పై విషయాన్ని బయటపెట్టారు.
తన దగ్గర ఓ సమాచారం ఉందని, రేపో మాపో మోదీ కేబినెట్‌లోకి సీఎం చంద్రబాబు వెళ్తారన్న సంకేతాలు ఉన్నాయని వెల్లడించారు. అప్పుడు సీఎంగా పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎం లోకేష్ ఉండొచ్చని సూచనప్రాయంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దావోస్‌లో ఉన్నారు సీఎం చంద్రబాబు. తొలుత బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని సీనియర్ జర్నలిస్టు ప్రస్తావించారు.
ALSO READ: బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఆ విధంగా ముందుకు
మోదీ కేబినెట్‌లోకి వెళ్లే ఉద్దేశం వుందా అని సీఎం చంద్రబాబును ప్రస్తావించారు. తనకు కేంద్రమంత్రి కావాలనే ఉద్దేశం లేదని ఓపెన్‌గా చెప్పేశారు. దీంతో ఏపీలో జరుగుతున్న ప్రచారానికి ఇక ఫుల్‌స్టాప్ పడింది. గత ప్రభుత్వం హయాంలో ఎంతో విధ్వంసం జరిగిందన్నారు. ప్రస్తుతం ఏపీ పునర్నిర్మాణమే తమ ధ్యేయమన్నారు.
ఎన్డీయే ప్రభుత్వంపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని మనసులోని మాట బయటపెట్టారు ముఖ్యమంత్రి. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే అన్న ప్రశ్నకు వివరణ ఇచ్చారు. ప్రజలను ఒక్కసారి మాత్రమే మోసం చేయగలరని అన్నారు. తమ ప్రభుత్వంలో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు ఉండదన్నారు. ఎవరు తప్పు చేసినా, చట్ట ప్రకారం వ్యవహరిస్తామన్నారు.
పనిలోపనిగా అదానీ విద్యుత్తు ఒప్పందాలపై చర్యలు తీసుకుంటారా? అన్న ప్రశ్నకు బదులిచ్చారు. ఆ వ్యవహారం యూఎస్ కోర్టులో ఉందని, కచ్చితమైన సమాచారం ఉంటే చర్యలు తప్పవన్నారు సీఎం చంద్రబాబు. తాము 15 శాతం వృద్ది సాధనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయటం తప్ప, నాకు ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవు. గత ఐదేళ్లలో, రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జరిగింది. ప్రజలు నా మీద నమ్మకంతో, ఎన్డీఏ మీద నమ్మకంతో పునర్నిర్మాణం చేయమని మమ్మల్ని గెలిపించారు. రాష్ట్రాన్ని రీ బిల్డ్ చేసి, అభివృద్ధి పథంలో… pic.twitter.com/9IVOiMCIbR
— Telugu Desam Party (@JaiTDP) January 22, 2025