Amaravati: రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. కేబినెట్ భేటీ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, విపక్షాలు చేస్తున్న విమర్శలను ఎలా తిప్పికొట్టారో మంత్రులకు దిశానిర్దేశం చేశారు.
కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు
గురువారం అమరావతిలో చంద్రబాబు కేబినెట్ సమావేశమైంది. అందులో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగ కల్పన, మౌలిక సదుపాయాల కల్పన, పట్టణాభివృద్ధి వంటి అంశాలు ప్రధాన అజెండాగా చర్చించింది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా పలు నిర్ణయాలపై ఆమోదముద్ర వేసింది.
పట్టణాలు, పురపాలక సంఘాల్లో పరిపాలనలో పారదర్శకతను పెంచేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. మున్సిపాలిటీలకు చెందిన ఆస్తుల లీజు రెన్యువల్ ప్రక్రియను సులభతరం కానుంది. అన్ని పట్టణ స్థానికసంస్థల్లో ఆస్తుల బదిలీకి సంబంధించిన మ్యుటేషన్ ఛార్జీలను ఒకే విధంగా ఉండేలా చట్ట సవరణ ప్రతిపాదనలు చేయనుంది.
తాజా రాజకీయాలపై చర్చ, విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని సూచన
అంతేకాదు పట్టణ ప్రాంతాల్లో ఆస్తి రిజిస్ట్రేషన్, బదిలీ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. రాష్ట్ర స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 2000 బ్యాచ్‌కు చెందిన 385 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పించేందుకు కేబినెట్ పచ్చ జెండా ఊపింది. న్యాయవ్యవస్థలో పని భారాన్ని తగ్గించేలా హైకోర్టు, జిల్లా న్యాయస్థానాల్లో మొత్తం 21 కొత్త పోస్టుల సృష్టికి అంగీకరించింది.
ఢిల్లీలో ఏపీ భవన్ నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చింది. కొత్త భవన నిర్మాణానికి దాదాపు రూ. 124 కోట్లు కేటాయించింది. ఏపీ భవన్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ కార్యాలయంలో ఆఫీస్ మేనేజర్ పోస్టును సెక్షన్ ఆఫీసర్‌గా అప్‌గ్రేడ్ చేసేందుకు ఆమోదం తెలిపింది.
ALSO READ: ప్రజల కంటే అమరావతికే ప్రయార్టీ.. కష్టాలు పట్టించుకోకుంటే గుణపాఠం తప్పదని షర్మిల హెచ్చరిక
గ్రామీణాభివృద్ధి శిక్షణ కోసం ఏపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్-ఈటీసీ కేంద్రాల్లో కొత్తగా 20 పోస్టులు కొత్తగా రానున్నాయి. మరో 9 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనుంది. రాజధాని అమరావతి నిర్మాణాలపై వైసీపీ విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలన్నారు సీఎం చంద్రబాబు.
నిర్మాణ ఖర్చులపై ఆ పార్టీ చేస్తున్న దుష్ర్పచారాలను ఎండగడుతూ వాస్తవాలను ప్రజలకు చెప్పాలన్నారు. ఇతర నిర్మాణ ఖర్చుల కంటే తక్కువన్న విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలన్నారు. తలెత్తిన ఇందన సమస్యపైనా ప్రజలకు వివరించాలన్నారు. మంత్రుల సింగపూర్ పర్యటన, గొడ్డలి పార్టీ చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలన్నారు.