Amaravati: వచ్చే సోమవారం నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో బీజేపీ జాగ్రత్తగా పావులు కదుపుతోంది. ఈసారి ఎలాగైనా డీ లిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ కావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది.
నవంబర్ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈసారి మళ్లీ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులను ఉభయ సభల్లో కేంద్రం ప్రవేశపెట్టనుంది. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఉండేందుకు బీజేపీ పెద్దలు జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఎన్డీయేలోని మిత్రులతో మంతనాలు సాగిస్తున్నారు.
శుక్రవారం ఉదయం అమరావతిలో చంద్రబాబు కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు పిలుపు వచ్చింది. దాని సారాంశం ఏంటంటే.. సాయంత్రానికి ఢిల్లీకి రావాలన్నది కీలకమైన పాయింట్. కేబినెట్ భేటీ తర్వాత ఇరువురు నేతలు ఢిల్లీకి బయలుదేరనున్నారు.