E-Paper
Advertisement

విశాఖ హైవేపై భయానక ఘటన.. టైరు పేలి కారులో మంటలు, డ్రైవర్ సజీవదహనం!

విశాఖ హైవేపై భయానక ఘటన.. టైరు పేలి కారులో మంటలు, డ్రైవర్ సజీవదహనం!
Advertisement

Visakha Car Accident: ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు క్రమంగా జోరందుకున్నాయి. శీతాకాలం సీజన్ కావడంతో ముందు వెళ్తున్న వాహనాలు కనిపించడం లేదు. ఫలితంగా ప్రమాదాల తీవ్రత పెరిగిపోతోంది. రీసెంట్‌గా భోగాపురంలో జరిగిన ఘటన ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. తాజాగా విశాఖ సిటీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్ కారులోనే సజీవ దహనమయ్యాడు. అసలు ఘటన ఎలా జరిగింది?

విశాఖ హైవేపై భయానక ఘటన

శుక్రవారం ఉదయం విశాఖ సిటీ శివారులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆనందపురం నుంచి పెందుర్తి జాతీయ రహదారిపై ఓ కారు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న కారు.. ఒక్కసారి టైరు పేలిపోయింది. దీంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాదం తర్వాత డ్రైవర్ స్పృహ కోల్పోయాడు. క్షణాల వ్యవధిలో కారుని మంటలు చుట్టుముట్టాయి. బయటకు రాలేక లోపలే చిక్కుకుని డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఘటన తెల్లవారుజామున జరగడంతో రోడ్లపై ఎవరూ లేకపోవడం, డ్రైవర్ మృతికి కారణంగా చెబుతున్నారు.

టైరు పేలి కారులో మంటలు, డ్రైవర్ సజీవదహనం!

Advertisement

ఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే కారు మొత్తం మంటల్లో చిక్కుతుంది. దానికి సంబంధించిన ఆనవాళ్లు గుర్తించే పనిలో పడ్డారు. ఇంతకీ కారు ఎవరిది? డ్రైవర్ ఎవరు? అనే దానిపై ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ చెక్ చేస్తున్నారు. ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

ALSO READ: మనసు మార్చుకున్న వైసీపీ అధినేత.. నోటీసుల విషయంలో జగన్ వెనక్కి? ఈసారి కారణమేంటి?

Related News

డీలిమిటేషన్ బిల్లు అంశం.. ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు.. హస్తినకు సీఎం చంద్రబాబు- డిప్యూటీ సీఎం పవన్

మనసు మార్చుకున్న వైసీపీ అధినేత.. నోటీసుల విషయంలో జగన్ వెనక్కి? ఈసారి కారణమేంటి?

ఏపీలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు.. కూటమి మద్దతుదారుల జోరు, మరి వైసీపీ మాటేంటి?

ఏపీలో నిరుద్యోగులకు తీపికబురు.. 1534 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్, నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ

బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్ లో అర్ధరాత్రి నుంచి ఒకటే వాన

ఏపీలో జరిగే స్థానిక ఎన్నికల నిర్వహణపై జగన్ ఫైర్!

బైకర్‌ను ఢీకొట్టిన రెండు కార్లు.. గాల్లో పల్టీలు కొట్టి కిందపడ్డాడు.. కట్ చేస్తే ఊహించని సీన్!

Big Stories

Advertisement
×