E-Paper
Advertisement

ఎయిర్ బేస్ టార్గెట్‌గా ఉగ్రకుట్ర.. ఏటీఎస్ మెరుపు ఆపరేషన్.. జైషే టెర్రరిస్ట్ అరెస్ట్!

ఎయిర్ బేస్ టార్గెట్‌గా ఉగ్రకుట్ర.. ఏటీఎస్ మెరుపు ఆపరేషన్.. జైషే టెర్రరిస్ట్ అరెస్ట్!
Advertisement

Gujarat Terror Plot: గుజరాత్‌లో భారీ ఉగ్రకుట్రను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) భగ్నం చేసింది. పాకిస్థాన్ నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘జైషే మహ్మద్’ సానుభూతి పరుడు 22 ఏళ్ల మహ్మద్ సహరూల్ ఇస్లాంను వడోదరలో అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్ కు సంబంధించి వివరాలను ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి వెల్లడించారు. వడోదరలోని భారత వాయుసేన (Air Force) స్థావరంపై దాడికి నిందితుడు కుట్ర పన్నినట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం ఎయిర్ ఫోర్స్ పరిసరాల్లో రెక్కీ సైతం నిర్వహించినట్లు పేర్కొన్నారు. తన మెుబైల్ లో ఫొటోలు కూడా తీసుకున్నాడని స్పష్టం చేశారు.

పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు.. దాడికి పాల్పడిన తర్వాత ఆ దేశానికి పారిపోవాలని మహ్మద్ సహరుల్ ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. నిందితుడి వద్ద నుంచి ఒక ఏకే 47 తుపాకీ, 23 తూటాలు, నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుడు గత ఏడాది కాలంగా జైషే హ్యాండ్లర్లతో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. కేంద్ర నిఘా సంస్థలు, గుజరాత్ ఏటీఎస్ కలిసి గత ఆరు నెలలుగా అతని కదలికలపై నిఘా పెట్టాయి. దాడి చేసేందుకు అతను గుజరాత్‌కు బయలుదేరాడని నవంబర్ 23న పక్కా సమాచారం అందడంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి.

Advertisement

అయితే భద్రతా దళాల కళ్లుగప్పేందుకు నిందితుడు అస్సాం నుంచి నేరుగా గుజరాత్‌కు రాకుండా పలు రైళ్లు, బస్సులు మారుతూ చుట్టుతిరిగి ప్రయాణించాడు. గతంలోనూ అతను వడోదరకు వచ్చి, గుజరాత్‌లోని పలు సున్నితమైన ప్రాంతాల వివరాలను సేకరించినట్లు అధికారులు వెల్లడించారు. నిందితుడి వద్ద దొరికిన ఏకే-47 తుపాకీని పాకిస్థాన్ నుంచి అక్రమంగా భారత్‌లోకి రవాణా చేసినట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు అతని మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ విశ్లేషణ చేయగా జైషే మహ్మద్‌కు సంబంధించిన ఉగ్రవాద లింక్స్ బయటపడ్డాయి.

Also Read: పాత ప్రత్యర్థులే కొత్త మిత్రులు.. డీలిమిటేషన్‌పై కేంద్రం మాస్టర్ ప్లాన్.. రంగంలోకి ‘మిషన్ 360’ వ్యూహం!

Advertisement

ప్రస్తుతం భద్రతా సంస్థలు నిందితుడిని లోతుగా విచారిస్తున్నాయి. సరిహద్దు ఆవల ఉన్న హ్యాండ్లర్ల వివరాలు, ఏకే-47 సరఫరా మార్గం, గుజరాత్‌లో స్లీపర్ సెల్స్ లేదా ఇతరుల సహాయం ఏమైనా అందిందా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఇదిలాఉంటే గుజరాత్ లో గతంలోనూ జైషే మహ్మద్ ఉగ్రకుట్రలను ఏటీఎస్ అధికారులు భగ్నం చేశారు. ఈ ఏడాది జూలైలో పలు రాష్ట్రాల్లో నిర్వహించిన దాడుల్లో ఎనిమిది మంది జైషే సభ్యులను అరెస్ట్ చేశారు. మత, విద్యా సంస్థలను అడ్డాగా చేసుకుని యువతను ఉగ్రవాదం వైపు మళ్లించడంతో పాటు లాజిస్టిక్స్ సదుపాయాలు జైషే కల్పిస్తున్నట్లు అప్పట్లో గుర్తించారు.

Also Read: కోకాపేట తర్వాత మియాపూర్ వంతు.. భూముల వేలానికి సర్కార్ రెడీ! టార్గెట్ రూ.30 వేల కోట్లు?

Tags

Related News

పాత ప్రత్యర్థులే కొత్త మిత్రులు.. డీలిమిటేషన్‌పై కేంద్రం మాస్టర్ ప్లాన్.. రంగంలోకి ‘మిషన్ 360’ వ్యూహం!

అన్నదమ్ముల ఘాతుకం.. భార్యలను చంపి అడవిలో పాతిపెట్టి ఆ తర్వాత, జార్ఖండ్‌లో తీవ్ర కలకలం

తెలంగాణ ఐఏఎస్ హత్య కేసు.. మళ్లీ జైలుకు బిహార్ మాజీ ఎంపీ.. అసలేం జరిగిందంటే?

ముదిరిన సోషల్ మీడియా వార్.. మెటాకు కాంగ్రెస్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్..!

అమితాబ్ ఇంటికి మళ్లీ బాంబు బెదిరింపు.. మెట్రో స్టేషన్లకూ హెచ్చరిక.. ముంబైలో హై అలర్ట్!

ప్యాకేజ్డ్ ఫుడ్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ గుర్తు ఉండాల్సిందే!

ఎమ్మెల్యే కూతురి పెళ్లిలో కరెన్సీ నోట్ల వర్షం.. చీపురుతో ఊడుస్తున్న దృశ్యాలు వైరల్!

Big Stories

Advertisement
×