E-Paper
Advertisement

రైలు కోచ్‌ల మధ్య ప్రమాదకర ప్రయాణం.. వైరల్ వీడియో చూస్తే షాకవుతారు!

రైలు కోచ్‌ల మధ్య ప్రమాదకర ప్రయాణం.. వైరల్ వీడియో చూస్తే షాకవుతారు!
Advertisement

Dangerous Train Stunt: రైలు ప్రయాణం అంటే చాలామందికి ఇష్టం. తక్కువ ఖర్చుతో సుదూర ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉండటంతో ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. అయితే, కొందరు ప్రయాణికులు రైల్లో వెళ్లేందుకు డబ్బులు లేక, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదకరంగా ప్రయాణించడం లాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రెండు కోచ్‌ల మధ్య ప్రయాణం.. ప్రాణాలతో చెలగాటం!

తాజాగా ఓ వీడియో నెటిజన్లను షాక్ కు గురిచేసింది. కదులుతున్న రైలులో రెండు కోచ్‌ల మధ్య ఉన్న ఇరుకైన ప్రదేశంలో ఓ వ్యక్తి బ్యాగ్ పట్టుకుని ప్రయాణిస్తున్నట్లు అందులో కనిపించింది. సాధారణంగా రైలు కోచ్‌ల మధ్య ఉండే ఈ ప్రాంతం ప్రయాణికులు నిలబడటానికి, ప్రయాణించడానికి కాదు. రైలు కదులుతున్న సమయంలో ఇలాంటి సాహసం చేయడం అత్యంత ప్రమాదకరం. చిన్న పొరపాటు జరిగినా పట్టాలపై పడిపోయే అవకాశం ఉంటుంది. దీంతో ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఆ సదరు వ్యక్తి ప్రయాణంపై ఆందోళన వ్యక్తం చేశారు. చేతిలో డబ్బులు లేక, ప్రాణాలకే ముప్పు తెచ్చుకునే ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది సదరు వ్యక్తి పరిస్థితి పట్ల మరికొంత మంది జాలి పడుతున్నారు. ఇలాంటి వ్యక్తులను చూసినప్పుడే, డబ్బులు పరిస్థితులను ఎంతటి భయంకర పరిస్థితులను నెట్టేస్తాయోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టికెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానా తప్పదా?

Advertisement

భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం సరైన టికెట్ లేకుండా ప్రయాణించడం నేరం. టికెట్ లేకుండా పట్టుబడితే ప్రయాణించిన దూరానికి సంబంధించిన ఛార్జీతో పాటు నిబంధనల ప్రకారం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పరిస్థితిని బట్టి ఇతర చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఫుట్‌బోర్డుపై నిలబడటం, కోచ్‌ల మధ్య ప్రయాణించడం లాంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలి. ప్రయాణంలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి కారణం కావచ్చు. అందుకే, ప్రతి ఒక్కరూ టికెట్‌ తో ప్రయాణించడంతో పాటు రైల్వే భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

Read Also: ఆహా అనిపించేలా వందేభారత్ ప్రయాణం.. అంజి ఖాడ్ బ్రిడ్జిపై అద్భుత వీడియో వైరల్!

Tags

Related News

ఆహా అనిపించేలా వందేభారత్ ప్రయాణం.. అంజి ఖాడ్ బ్రిడ్జిపై అద్భుత వీడియో వైరల్!

రన్నింగ్ ట్రైన్ లో హారతి వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే సీరియస్!

ఇయర్ ఎండ్ హాలీడేకు ఫస్ట్ ఛాయిస్.. ఢిల్లీని వెనక్కి నెట్టిన సౌత్ సిటీ!

ఇండియన్ ఫస్ట్ బుల్లెట్ రైలు వచ్చేస్తోంది.. ట్రయల్ రన్‌ ఎప్పుడంటే?

పులి vs సింహం.. ముఖాముఖి పోరులో పైచేయి దేనిది? నిపుణుల ఆసక్తికర విశ్లేషణ!

టికెట్లపై 20% డిస్కౌంట్.. ఇండియన్ ట్రావెలర్స్ కు ఎతిహాద్ అదిరిపోయే ఆఫర్!

ప్రపంచంలోనే బెస్ట్ టూరిస్ట్ ప్లేస్.. మన ఇండియాలోనే.. అస్సలు మిస్సవ్వకండి!

Big Stories

Advertisement
×