MS Dhoni New House: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (Mahendra Singh Dhoni) ఇటీవల ఐపీఎల్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించి ఫ్యామిలీతో గడుపుతూ చిల్ అవుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల కావ్య పాప – అనిరుధ్ పెళ్లికి హాజరైన మహేంద్రసింగ్ ధోని, కొత్తగా ఇంటి నిర్మాణం (MS Dhoni New House) కూడా చేపట్టాడు. రాంచీ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న సెంబో కొండ ప్రాంతంపై తన మూడో ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. ఇందులో భాగంగానే గురువారం కొత్త ఇంటి పనులను స్వయంగా మహేందర్ సింగ్ ధోని పరిశీలించాడు. సింపుల్ గా టీ-షర్ట్ పైన అక్కడికి వెళ్లిన మహేందర్ సింగ్ ధోని.. అక్కడ జరుగుతున్న పనులపై ఆరా తీశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ క్రమంలో కొండపైన మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) కడుతున్న ఇంటి నిర్మాణంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.
రాంచీ కొండపై ఏకంగా రెండు ఎకరాలలో మహేంద్రసింగ్ ధోని తన కొత్త ఇంటిని నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కొండ పైన ఉన్న స్థలాన్ని ఝార్ఖండ్ ప్రభుత్వం మహేంద్రసింగ్ ధోనీకి డబ్బులకే అందించినట్టు తెలుస్తోంది. సాధారణంగా కొండలపై ప్రైవేట్ నిర్మాణాలకు ప్రభుత్వాలు పర్మిషన్లు ఇవ్వవు. దాదాపు అలాంటి భూములు ప్రభుత్వానికి చెందుతాయి. కానీ ధోని కోసం స్పెషల్ గా జీవో తీసుకువచ్చి, రెండెకరాల భూమిని ప్రభుత్వ ధరకు ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో దాదాపు రూ.40 కోట్లతో కొత్త ఇంటిని ధోని నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త ఇంటిలో 30 గదులు ఉంటాయని సమాచారం. ఇప్పటికే మహేంద్రసింగ్ ధోనీకి హర్ములో పాత ఇల్లు ఉండగా… కైలాష్ పతి ఫామ్ హౌస్ సిప్లియా ప్రాంతంలో ఉంది. ఇక ఇప్పుడు మూడో ఇంటిని సెంబో కొండ ప్రాంతంపై నిర్మిస్తున్నాడు. దీనికి జైపూర్ ప్రాంతానికి సంబంధించిన ప్రముఖ ఆర్కిటెక్ శాంతన్ గార్గ్ డిజైన్ చేస్తున్నాడు.
Rishabh Pant checking his share from the new house of MS Dhoni.
This property will be shared between Pant and Ziva.🥺❤️ pic.twitter.com/1OtBgYpPrs
— Drona (@drona_17) August 4, 2026
👿 Tired of his fans,
MS Dhoni is building his new house on a hill. 😭😁
Dhoni found London-like privacy in India. 😂 pic.twitter.com/Af861TXtEj
— Sarkari Umpire (@SarkariUmpire) November 25, 2026