BigTV English

Chandrababu-Pawan: ఢిల్లీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, కేంద్రమంత్రులతో భేటీ

Chandrababu-Pawan: ఢిల్లీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, కేంద్రమంత్రులతో భేటీ

Chandrababu-Pawan:  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారు. బుధవారం సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్తారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పర్యటనలోవున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుధవారం సాయంత్రం ఢిల్లీకి రానున్నారు ఆయన రెండు రోజుల పాటు అక్కడే ఉంటారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


ఢిల్లీ టూర్‌లో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వినతి పత్రం ఇవ్వనున్నారు. ఈ విషయమై ఇప్పటికే కేంద్ర పెద్దలను కలిశారు ఎంపీలు, పలువురు మంత్రులు. కేంద్ర వ్యవసాయ అధికారులతో చర్చించిన రాష్ట్ర అధికారులు. మిర్చి రైతులకు శుభవార్త వస్తుందని భావిస్తున్నారు ప్రభుత్వం పెద్దలు. ఈ క్రమంలో గురువారం జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీ వాయిదా పడినట్టు సచివాలయం వర్గాలు చెబుతున్నాయి.

గురువారం రామ్ లీలా మైదాన్ వేదికగా ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ఇదివరకే ఆహ్వానం పంపింది. ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలైన తెలుగుదేశం, జనసేన, ఎన్సీపీ, శివసేన, ఎల్జేపీ పార్టీలతోపాటు మరికొందరు ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇందులో పాల్గొననున్నారు.


ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్రమంత్రులు, ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బిహార్ ముఖ్యమంత్రులు దీనికి హాజరు కానున్నారు. బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, వివేక్ ఒబెరాయ్, ఎంపీ హేమామాలిని, కిరణ్ ఖేర్ హాజరు అవుతున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: జగన్‌కు కష్టాలు తప్పవా? కేసు నమోదు?

గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం జరగనుంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కొత్త ముఖ్యమంత్రి చేత ప్రమాణం చేయించనున్నారు. రాంలీలా మైదానంలో సుమారు 30వేల మంది కూర్చునేందుకు వీలుగా సీటింగ్ ఏర్పాట్లు చేశారు. మూడు పెద్ద స్టేజీలను రెడీ చేశారు.

ప్రధాన స్టేజి మీద ప్రధానమంత్రి, హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ ముఖ్యమంత్రి ఉంటారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. మెుత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను కైవసం చేసుకుంది. ఆప్ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమైన విషయం తెల్సిందే.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×