CM Chandrababu new task to Pawan(Andhra politics news): ఏపీ సీఎం చంద్రబాబు పరిపాలనపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారా? 11 గంటలపాటు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మీటింగ్ దేనికి సంకేతం? సోమవారం జరిగిన సమావేశంలో అధికారులకు ప్రభుత్వం ఇచ్చిన టాస్క్‌లేంటి? పనిలోపనిగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కు కొత్త టాస్క్ ఇచ్చారా?
పరిపాలనపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వ శాఖల పనితీరు గురించి తెలుసు కున్న ఆయన, అధికారులను ట్రాన్స్‌ఫర్ చేశారు. అంతేకాదు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సోమవారం దాదాపు 11 గంటలపాటు సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కలెక్టర్లు, జిల్లాల ఎస్పీలకు ఇవ్వాల్సిన టాస్క్‌లు ఇచ్చేశారు. అటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కొత్త బాధ్యతలు అప్పగించారు.
గడిచిన ఐదేళ్లు ఏపీలో నరికిన చెట్లపై లోక్‌సభ సమావేశాల్లో కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ సమాధానం ఇచ్చారు. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని దీనిపై అడిగిన ప్రశ్నకు మంత్రి రిప్లై ఇచ్చారు. ఐదేళ్లలో దాదాపు 4, 84, 249 చెట్లను నరికినట్టు తెలిపారు. అందులో పట్టాదారు భూముల్లో 2,44,830, మళ్లించిన అటవీ భూముల్లో 1,35,023 చెట్లు, చట్ట విరుద్ధంగా 1,04,396 చెట్లను తొలగించినట్లు వెల్లడించారు.
ALSO READ: ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ రద్దవుతుందా?.. మంత్రి క్లారిటీ
కలెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు కొత్త టాస్క్ ఇచ్చారు. అటవీశాఖ పై మాట్లాడుతున్న సందర్భంలో ఏపీలో భారీగా చెట్టు పెంచి అటవీ సంపద పెంచాలని అధికారులను ఆదేశించారు. పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎ పవన్ కల్యాణ్ బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.
ఒకేసారి 5 లేదా 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు సీఎం చంద్రబాబు. ఉమ్మడి ఏపీలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఆ తరహా కార్యక్రమాన్ని చేపట్టామని గుర్తు చేశారు. గతంలో వనమహోత్సవం అనే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. మొత్తానికి అధికారులతోపాటు మంత్రులకు వారికి ఇవ్వాల్సిన టాస్కులను అప్పగించారు సీఎం చంద్రబాబు.